Jobs: సరిహద్దు భద్రతా దళం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారీ వేతనంలో కానిస్టెబుల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను ఈ సంస్థ తాజాగా విడుదల చేసింది. మొత్తం 2,788 పోస్టుల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్ఎఫ్ అధికారిక సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
2022 సంవత్సరం జనవరి 15వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం మార్చి 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలలో పురుషులకు 2651 ఉద్యోగాలు ఉండగా స్త్రీలకు 137 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఇతర అలవెన్స్ లు కూడా లభిస్తాయి. http://www.davp.nic.in/writereaddata/ads/eng_19110_78_2122b.pdf లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, వ్రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (pst), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (pet) ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
[…] Professional Queuer: పని చేసి పదిమందిని సాకితే ఉపాయంతో వంద మందిని సాకారనేది సామెత. ఉపాయం ఉన్న వాడు ఉపవాసం ఉండడు అనేది మరో మాట. కరోనా నేపథ్యంలో అందరు భౌతిక దూరం ఉండేందుకు అలవాటు పడ్డారు. దీంతో అన్ని రంగాల్లో క్యూ లైన్లు ప్రధాన పాత్ర పోషించాయి. దీంతో మనదేశంలో క్యూలైన్ల ప్రాధాన్యం అంతగా లేకపోయినా బ్రిటన్ లో మాత్రం ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దీంతో క్యూ లైన్లలో నిలబడిన వారు సైతం డబ్బులు సంపాదించుకోవచ్చని తెలుస్తోంది. […]