Professional Queuer: పని చేసి పదిమందిని సాకితే ఉపాయంతో వంద మందిని సాకారనేది సామెత. ఉపాయం ఉన్న వాడు ఉపవాసం ఉండడు అనేది మరో మాట. కరోనా నేపథ్యంలో అందరు భౌతిక దూరం ఉండేందుకు అలవాటు పడ్డారు. దీంతో అన్ని రంగాల్లో క్యూ లైన్లు ప్రధాన పాత్ర పోషించాయి. దీంతో మనదేశంలో క్యూలైన్ల ప్రాధాన్యం అంతగా లేకపోయినా బ్రిటన్ లో మాత్రం ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దీంతో క్యూ లైన్లలో నిలబడిన వారు సైతం డబ్బులు సంపాదించుకోవచ్చని తెలుస్తోంది.

అయితే బ్రిటన్ లో మాత్రం క్యూలైన్లలో నిలబడితే భారీగానే డబ్బులు చెల్లిస్తారు. దీంతో ఇది కొందరికి జీవనోపాధిగా మారింది. ఎక్కువ కష్టపడకుండానే డబ్బులు సంపాదించడంతో వారు అలవోకగా క్యూలైన్లలో నిలబడుతూ తాము కోరుకున్న విధంగా డబ్బులు సంపాదించడం గమనార్హం. క్యూలైన్లలో నిలబడి కూడా ప్రొఫెషనల్ గానే డబ్బు సంపాదిచడంలోనే వారి ఉపాధి వెతుక్కుంటున్నారు.
Also Read: ఎన్టీఆర్30 హీరోయిన్ గా తెరపైకి కొత్త పేరు..!
అతడి పేరు ప్రెడ్డీ బెకిట్. ప్రతి రోజు క్యూలైన్లలో నిలబడే డబ్బులు సంపాదిస్తుంటాడు. అది అతడికో జీవనోపాధిగా మారింది. దీంతో అతడి సంపాదన ఎంతో తెలిస్తే షాకే. రోజుకు సుమారు రూ. 16 వేలు సంపాదిస్తాడు. ఒక గంటకు రూ.2 వేలు ఇస్తారు. అంటే సగటున ఎనిమిది గంటలు పనిచేస్తే అతడికి వచ్చే ఆదాయం రూ. 16 వేలు కావడంతో అతడి రూటే కరెక్ట్ అనే విధంగా తయారయింది. మనం ఇంత కష్టపడినా రోజుకు కనీసం ఏ రూ.1000 సంపాదిస్తే గొప్ప. కానీ అతడు క్యూలైన్లో నిలబడి ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం గమనార్హం.
లండన్ లో క్యూయర్ల సంఖ్య కూడా ఎక్కువే. మన దేశంలో ఎవరి పనులు వారు చేసుకుంటారు. అందుకే ఎవరు కూడా లైన్లలో నిలబడితే డబ్బు ఇవ్వరు. కానీ బ్రిటన్ లో అలా కాదు. అదో జీవనోపాధిగా మారడంతో అందరు అటు వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రాబోయే కాలంలో మరింత మంది ఈ రంగం వైపు దృష్టి సారించే అవకాశం ఏర్పడింది.
Also Read: బాక్సాఫీస్ : ‘బంగార్రాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !
[…] Also Read: క్యూలైన్లో నిలబడితేనే అంత సంపాదనా? […]
[…] Also Read: క్యూలైన్లో నిలబడితేనే అంత సంపాదనా? […]