NTR30 Heroine: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో NTR30 మూవీ రాబోతుంది. దాదాపు మూడేళ్లపాటు ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసమే డేట్స్ కేటాయించాడు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి కావడంతో తన తదుపరి మూవీపై ఎన్టీఆర్ దృష్టిసారిస్తున్నాడు. ‘జనతా గ్యారేజీ’ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ యంగ్ టైగర్ ‘ఎన్టీఆర్30’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

కొరటాల శివ-యంగ్ టైగర్ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజీ’ మూవీ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘ఎన్టీఆర్30’పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్యాన్ ఇండియాలో లెవల్లో నిర్మాణం అవుతోంది. ఇక త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజు కానుంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను దర్శక, నిర్మాతలు భారీ లెవల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ ను వచ్చేనెల ఫిబ్రవరి 18 నుంచి లాంఛనంగా ప్రారంభించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. #NTR30లో ఇద్దరు హీరోయిన్లు ఉండగా మెయిన్ హీరోగా అలియాభట్, కియారా అడ్వాణీ పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అయితే తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది. ‘పుష్ప’తో సాలీడ్ హిట్టందుకున్న రష్మిక మందన్న ఎన్టీఆర్ కు జోడిగా ఎంపికైందనే ప్రచారం జరుగుతోంది.
కన్నడ నుంచి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతీ కాలంలో ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. వరుస హిట్లతో గోల్డెన్ హీరోయిన్ అనిపించుకుంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’లో శ్రీవల్లిగా కన్పించి అభిమానులను అలరించింది. ఈ మూవీ హిట్టుతో రష్మిక మందన్న ప్యాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ మూవీలో ఆమెకు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఎన్టీఆర్ తో రష్మిక ఆడిపాడటం ఖాయంగా కన్పిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.