YS Jagan And YS Sunitha: సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఏపీ సీఎం జగన్ ను వివేకా కుమార్తె డాక్టర్ సునీత వైద్య పరీక్షలు చేస్తున్నట్టు ఉండే ఫొటోలు దర్శనమిస్తున్నాయి.ఈ ఫొటోలపై వైసీపీ శ్రేణులు చిత్ర,విచిత్రంగా స్పందిస్తున్నాయి.నెటిజెన్లు మాత్రం దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఈ ఈ ఫొటో ఎప్పుడు? ఎక్కడ? అనే చర్చ ప్రారంభమైంది. ఎక్కువమంది ఆరా తీసే పనిలో పడ్డారు.
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్న సమయం అది. దానిని నిరసిస్తూ జగన్ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకు దిగారు. హైదరాబాద్ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. రోజురోజుకు జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆ సమయంలో డాక్టర్ సునీత అన్న జగన్ ఆరోగ్యం కోసం పరితపించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అన్న ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. గంట గంటకు ఒకసారి బీపీ చెక్ చేస్తూ జగన్ ను చూసుకుంటూ వచ్చారు. అప్పట్లో అన్నా చెల్లెలు బంధం ఇది అంటూ వైసీపీ శ్రేణులు సంబరపడిపోయాయి. అప్పుడు తీసిన ఫొటోలే ఇవి. వీటిని చూసిన నెటిజన్లు రకరకాల ప్రశ్నలను సంధిస్తున్నారు. అంత ప్రేమగా చూసుకున్న చెల్లిని.. తండ్రి లేకుండా చేస్తారా అంటూ ఎక్కువమంది సానుభూతి చూపుతున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటో గురించే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. సీఎం జగన్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోండి.. అప్పుడు ఇలా.. ఇప్పుడు ఇలా అంటూ ఎక్కువ మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ కామెంట్స్ తో వైసీపీ వీరాభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి కుమార్తె డాక్టర్ సునీత గట్టిగానే పోరాడుతున్నారు. కేసులో అనుమానితులను ఏపీ సీఎం జగన్ రక్షిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో అన్నా చెల్లెలు ఫొటో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తోంది. రకరకాల చర్చకు కారణమవుతోంది. ఆ ఒక్క ఫొటోతో వైసిపి నీరుగారి పోతోంది. ఎలా స్పందించాలో తెలియక సతమతమవుతోంది.