Crypto Currency: స్థిరంగా సాగుతున్న ప్రయాణంలో అనుకొని కుదుపు ఎదురైతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రపంచం పరిస్థితి కూడా అలాగే ఉంది. మొన్నటిదాకా కోవిడ్ చుక్కలు చూపించింది. ఇప్పటికీ ఆ రోగం పుట్టిన డ్రాగన్ దేశంలో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. బయటకు తెలియడం లేదు కానీ… అక్కడ లెక్కకు మిక్కిలి మరణాలు నమోదు అవుతున్నాయి.. అది చైనా కాబట్టి.. నియంత పాలిస్తున్నాడు కాబట్టి… ప్రజాస్వామ్య హక్కులు అక్కడ ఉండవు కాబట్టి.. మనకు ఎలాంటి సమాచారం తెలియదు. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ చెబితే తప్ప.. సరే ఇప్పుడు ఆ సోది ఎందుకు గాని.. మొన్నటిదాకా కోవిడ్ తో సతమతమైన ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఈ సమయంలో నాటో దేశాలు తీసుకున్న ఒక్క నిర్ణయం కారణంగా రష్యా ఉక్రెయిన్ పై గుడ్లు ఉరుమింది. ఫలితంగా యుద్ధం వచ్చింది. ఇది ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. ఈ పరిణామం అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా భారీగా పతనమైంది క్రిప్టో కరెన్సీ. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన ఈ కరెన్సీ.. ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. దీని ఆధారంగా పెట్టుబడులు పెట్టినవారు నిండా ముని గారు. క్రిప్టో కరెన్సీ ఆధారంగా లావాదేవీలు నిర్వహించే ఎఫ్ టీ ఎక్స్ అని కంపెనీ ఏకంగా దివాలా తీసింది. 2008లో లేమాన్ బ్రదర్స్ పతనం ఎంతటి సంచలనమో… 2022లో ఎఫ్ టీ ఎక్స్ దివాలా కూడా అంతటి పతనమే. కాకపోతే క్రిప్టో కరెన్సీ ని ప్రపంచంలోని అన్ని దేశాలు అధికారికంగా గుర్తించలేదు కాబట్టి దీని ప్రభావం అంతటా పడలేదు. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది. కాకపోతే క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెట్టినవారు నిండా మునిగారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. భారత ప్రభుత్వం దీనిని గుర్తించకపోవడం వల్ల పెద్ద ముప్పే తప్పింది.

డిమ్యాట్ ఖాతాలు
కొద్ది నెలలుగా డి మ్యాట్ ఖాతాల స్పీడ్ తగ్గింది. కానీ అక్టోబర్ కల్లా ఇవి 10.4 కోట్లను తాకాయి. గత ఏడాది అక్టోబర్ లో నమోదైన 7.4 కోట్ల ఖాతాలతో పోలిస్తే 41% అధికం.. ఈక్విటీ మార్కెట్లు అందిస్తున్న ఆకర్షణీయ రాబడులు ఇందుకు ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి 2022 ఆగస్టు నుంచి డి మ్యాట్ ఖాతాలు నీరసిస్తున్నాయి. ఈ నెలలో కొత్తగా 206 లక్షలు జత కాగా.. సెప్టెంబర్ లో ఇవి 20 లక్షలకు తగ్గాయి. అక్టోబర్లో మరింత నిరసించి 18 లక్షల మాత్రమే జమ అయ్యాయి. 2021 అక్టోబర్లో 36 లక్షల డి మ్యాట్ ఖాతాలు కొత్తగా ప్రారంభమయ్యాయి.. ఇందుకు ప్రధానంగా పబ్లిక్ ఇష్యుల జోరు తగ్గడం కారణమైంది. ప్రపంచ పరిణామాలతో ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నాయి.. మార్కెట్లను మించి మిడ్, స్మాల్ క్యాప్స్ బలహీనపడటం వంటి అంశాలు ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
ఇతర కారణాలూ లేకపోలేదు
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఏడాది జనవరి నుంచి డీ మ్యాట్ ఖాతాల స్పీడ్ తగ్గింది. అంతర్జాతీయ స్థాయిలో ధరల పెరుగుదల ఒత్తిళ్లు, వడ్డీ రేట్లు పెరగడం వంటివి ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణం అవుతున్నాయి. ఇలాంటి అనిశ్చితుల నేపథ్యంలో బ్రోకర్లు కస్టమర్లను ఆకట్టుకునే ప్రణాళికలపై వ్యయాలను పూర్తిగా తగ్గించారు.

గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఇదే నెలలో కొత్తగా ప్రారంభమైన డిమ్యాట్ ఖాతాలు సగానికి పడిపోవడానికి పండుగల సీజన్ ప్రభావం చూపించింది. 2022 అక్టోబర్లో 18 రోజులు మాత్రమే మార్కెట్లు పనిచేశాయి. సెలవులను మినహాయిస్తే సెప్టెంబర్ లో 22 రోజులపాటు ట్రేడింగ్ జరిగింది. దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు బలపేతం కావడం, మరింతమంది మార్కెట్లలోకి ప్రవేశించే వీలు వంటి అంశాలు ఇందుకు దోహదం చేశాయి.