National Parks: పిల్లలకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయి. కొన్ని పాఠశాలలు సెలవులు కూడా ప్రకటించాయి. మరి కొన్ని పాఠశాలలు ఏప్రిల్ 23 నుంచి సెలవులు ప్రకటించనున్నాయి. సెలవుల్లో ఇంట్లోనే ఉంటే పిల్లలు ఇల్లు పీకి పందిరి వేస్తారు. అలాంటప్పుడు వారిని ఎక్కడికైనా తీసుకెళ్తేనే కాస్త శాంతంగా ఉంటారు. పెద్దలకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి.. ఈ సమ్మర్ లో ఈ ఐదు జాతీయ పార్కులను ఒక్కసారి సందర్శించండి. జీవితానికి సరిపడా అనుభూతులు మీ సొంతమవుతాయంటే నమ్మండి. మనదేశంలో దట్టమైన అరణ్యాలకు కొదువలేదు. అందులో అరుదైన జంతువులు.. క్రూర మృగాలు.. ఇంకా చాలా ఉన్నాయి. పర్యాటకాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆ అరణ్యాలలో టూరిస్టులను అనుమతిస్తోంది. పండుగలు, సమ్మర్ హాలిడేస్ సమయంలో ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రకటిస్తోంది.
హేమిస్ నేషనల్ పార్క్
ఇది జమ్మూ కాశ్మీర్లోని లడ్డాఖ్ ప్రాంతంలో ఉంది. ఇది మన దేశంలోనే అతిపెద్ద ఉద్యానవనం. ఈ ప్రాంతంలో అనేక అరుదైన జంతువులున్నాయి. ముఖ్యంగా మంచు ప్రాంతాలలో పెరిగే పులులు ఇక్కడ కనిపిస్తాయి.. ధ్రువపు ఎలుగుబంట్లను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో ఉంటుంది కాబట్టి.. ఈ ఎండాకాలంలో సరికొత్త అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.
నాగర్ హోల్ నేషనల్ పార్క్
కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఈ పార్క్ అరుదైన వృక్షాలకు నెలవు. ఏనుగు నుంచి మొదలు పెడితే పులుల వరకు ఈ పార్కులో కనిపిస్తాయి. ఈ పార్కు అరుదైన గంధపు చెట్లకు నెలవు. ఇక్కడ జలపాతాలు కూడా ఉంటాయి. కాకపోతే ఎండాకాలం అవి అంతగా ప్రవహించవు.
గిర్ నేషనల్ పార్క్
ఈ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది విభిన్నమైన అడవులకు నెలవు. ఆసియా ప్రాంతానికి చెందిన ప్రత్యేక సింహాలు ఇక్కడ ఆవాసాన్ని ఏర్పరచుకున్నాయి. విభిన్న రకాల పులులు ఇక్కడ కనిపిస్తాయి. జింకలు, అడవి దున్నలు, కంచర గాడిదలు, సాంబార్ జింకలు ఈ అడవుల్లో విస్తారంగా ఉంటాయి.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
హిమాలయ పర్వత సానువుల్లో ఏర్పడిన అడవి ఇది. ఈ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ విస్తారంగా పులులు నివసిస్తాయి. జింకలు కూడా అదే సంఖ్యలో ఉంటాయి. ఇక్కడి పచ్చిక మైదానాలు ఆఫ్రికాలోని కెన్యా ప్రాంతాన్ని పోలి ఉంటాయి. అందుకే ఇక్కడ సంవత్సరం మొత్తం గడ్డి పచ్చిగానే ఉంటుంది. ఈ అడవిలో అద్భుతమైన సరస్సులు కూడా ఉన్నాయి.
డిసర్ట్ నేషనల్ పార్క్
ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఎడారి రాష్ట్రమైనప్పటికీ ఈ అడవి లో సంవత్సరం మొత్తం పచ్చగానే ఉంటుంది. అక్కడక్కడ సరస్సులు, పెద్దపెద్ద కాలువలు ఉంటాయి. ఇక్కడ మనుబోతు జాతికి చెందిన జింకలు కనిపిస్తాయి. వాటి కొమ్ములు పెద్దవిగాను, నేత్రాలు చిన్నవిగాను, భారీ శరీరంతో కనిపిస్తాయి.
ఈ అడవులను సందర్శించాలంటే.. వాటికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవాలి. సమ్మర్ నేపథ్యంలో సరికొత్త ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. వివిధ కేటగిరిల ఆధారంగా ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంతో కలిసి వెళ్తే ఒకరకంగా, ఆఫీస్ కొలీగ్స్ తో కలిసి వెళ్తే ఒక రకంగా, స్నేహితులతో కలిసి వెళితే ఒక రకమైన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ ఎండాకాలంలో రొటీన్ గా ఉండే కంటే.. కాస్త అడవుల వెంట తిరగాలి అంటే.. జంతువులను దగ్గర నుండి చూడాలంటే.. ఈ అడవులను సందర్శించడం బెస్ట్ ఛాయిస్.