Bhasha Sangam: దేశంలోని విద్యార్థులలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ భాషలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసినా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉండవని చెప్పాలి. ప్రభుత్వం విద్యార్థులలో భాషా జ్ఞానాన్ని పెంచాలనే ఆలోచనతో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కింద భాషా సంగం అనే యాప్ ను రూపొందించింది.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఈ యాప్ ను రూపొందించడం గమనార్హం. ఈ యాప్ ద్వారా వివిధ రాష్ట్రాల సంస్కృతికి సంబంధించిన సమాచారంను కూడా తెలుసుకోవచ్చు. గేమ్ లాగా రూపొందించిన ఈ యాప్ లో సులభంగా ఈ లెసన్ యాప్ పై విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. భాషా అభ్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు, సమాధానాల ప్రాతిపదికన ఈ యాప్ ను రూపొందించారని సమాచారం.
44 ప్రత్యేక పాత్రల ద్వారా దేశంలోని విభిన్న సంస్కృతిని ఈ యాప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత ఫీడ్ బ్యాక్ ఇచ్చేలా ఈ యాప్ ను రూపొందించారు. భాషలో సాధించిన స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ ను పొందవచ్చు.