Best Smartphones: ప్రస్తుతం జనరేషన్‌లో స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సీర అన్నట్టు మారిపోయిది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. అయితే మిడిల్ క్లాస్ వారికి ఎక్కువగా మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ లు కావాలి. చాలా మంది రూ.20,000లోపు మొబైల్ ఫోన్లు కావాలని అనుకుంటారు. ఇందులో ఏయే మోడల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ మొబైల్స్‌లో ఈ మధ్య ఫీచర్లు కూడా చాలానే వచ్చాయి. మరి అందులో ఉన్న బెస్ట్ మొబైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది పోకో ఎక్స్4 ప్రో 5జీ ఫోన్ గురించి. దీనికి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంది. దీని ప్రారంభ ధర రూ.18999గా ఉంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 5జీ కనెక్టివిటీ ఉండటం దీనికి ప్లస్ పాయింట్. 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 64MP బ్యాక్ కెమెరాలతో పాటు 16MP ఫ్రంట్ కెెమెరా దీనికి ఉన్నాయి. 64జీబీ స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరీజ్‌తో పాటు 6జీబీ ర్యామ్ తో కలిసి వస్తోంది.
Also Read: Bigg Boss Telugu Non Stop OTT: బిగ్ బాస్ లోకి మరో వైల్డ్ కార్డ్.. హౌస్ లోకి బెస్ట్ ఎంటర్ టైనర్

ఇక మరో మొబైల్ రియల్‌మీ 9 ప్రో 5జీ కూడా చాలా ఫీచర్లతో వస్తోంది. ఇది కూడా మిడ్ రేంజ్ మొబైల్ కొనాలనుకునే వారికి చాలా సౌకర్యవంతంగా పనిచేస్తుంది. ఇకపోతే దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది. ఇది కూడా 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 695తో వస్తోంది.

దీని ప్రారంభ ధర రూ.14999తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ చాలా ఫీచర్లతో వస్తోంది. దీనికి 64MP బ్యాక్ కెమెరాలతో పాటు 16MP ఫ్రంట్ కెమెరా కూడా దీనికి యాడ్ చేసి ఉన్నాయి. 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి సపోర్టుగా ఉంది. 6జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా దీనికి ఉన్నాయి. మరి లేటెందుకు మీరు కూడా వెంటనే ఆర్డర్ చేయండి.