https://oktelugu.com/

Acharya: మెగాస్టార్ షాకింగ్ నిర్ణయం…ఆచార్య నుండి కాజల్ సన్నివేశాలు తొలగించారా?

Acharya: మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివ కాంబినేషన్ తెరకెక్కిన ఆచార్య సినిమా ఎట్టకేలకు ఎన్నో వాయిదాల అనంతరం ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ముఖ్య పాత్రలో నటించాడు..#RRR తర్వాత ఆయన పెద్ద గాప్ తీసుకోకుండా వెండితెర మీద కనిపిస్తున్న సినిమా ఇదే..ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా ట్రైలర్ కి కూడా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 17, 2022 / 11:01 AM IST
    Follow us on

    Acharya: మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివ కాంబినేషన్ తెరకెక్కిన ఆచార్య సినిమా ఎట్టకేలకు ఎన్నో వాయిదాల అనంతరం ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ముఖ్య పాత్రలో నటించాడు..#RRR తర్వాత ఆయన పెద్ద గాప్ తీసుకోకుండా వెండితెర మీద కనిపిస్తున్న సినిమా ఇదే..ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా ట్రైలర్ కి కూడా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఈ ట్రైలర్ లో చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన షాట్స్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లేటెస్ట్ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అదేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    Acharya

    ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత వస్తున్నా రెండవ సినిమా ఇది..అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లోనే కాజల్ గర్వాల్ కి ప్రెగ్నన్సీ వచ్చింది అట..దాని వల్ల ఆమె ఈ సినిమాలో మిగిలి ఉన్న ఆమె పాత్ర చిత్రీకరణ కి డుమ్మా కొట్టేసింది అట..కొరటాల శివ & టీం ఆమెని ఎంతో రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఆమె ఒప్పుకోలేదు అట..ఆమె పాత్ర కి కూడా సినిమాలో పెద్ద ప్రాధాన్యత లేకపోవడం తో కొరటాల శివ ఆమె సన్నివేశాలను తొలగించేయాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది..

    Also Read: Mumbi Indians: ముంబై ఇండియన్స్ మళ్లీ ఫట్.. ఈసారి టైటిల్ రేసులోంచి ఔట్

    ఇక ఇటీవలే విడుదల అయినా ఆచార్య ట్రైలర్ లో ముఖ్య పాత్ర పోషించిన పూజ హెగ్డే షాట్స్ కూడా ఉన్నాయి కానీ, కాజల్ కి సంబంధించిన షాట్స్ మాత్రం లేవు..దీనిని బట్టి చూస్తుంటే సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నట్టు నిజంగా ఆమె పాత్రని సినిమా నుండి తీసి వేసారా నే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

    Acharya

    ఇక తన ఇంస్టాగ్రామ్ లో పైడ్ యాడ్స్ ని తరుచు ప్రమోట్ చేసే కాజల్ అగర్వాల్..తానూ నటించిన ఆచార్య సినిమా ట్రైలర్ ని మాత్రం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చెయ్యలేదు..ఇవి అన్ని చూస్తుంటే నిజంగానే ఆమెకి మరియు ఆచార్య టీం కి మధ్యలో గొడవ జరిగినట్టు తెలుస్తుంది..వాస్తవానికి కాజల్ అగర్వాల్ మరియు ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరు కలిసి దాదాపుగా నాలుగు సినిమాల్లో నటించారు..నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి..అంత మంచి రాపో ఉన్న వీరిమధ్య గొడవలు వచ్చే ఛాన్స్ లేదు అని, ఒక్కవేల చిన్న చిన్న మనస్పర్డులు ఎదురైనా కూడా వీళ్ళు పరిష్కరించుకోగలరు అంటూ మెగా ఫామిలీ కి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి..మరి ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ ఉందా లేదా అనేది తెలియాలి అంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.

    Also Read:Chiranjeevi Ram Charan: కొడుకును డామినేట్ చేయడానికి చిరంజీవి స్కెచ్.. తగ్గేదేలే అన్న రాంచరణ్

    Tags