Best friends: ప్రపంచంలో అందమైన బంధం స్నేహం. తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి.. బంధువులతో చేయలేనివి స్నేహితులతో చేయవచ్చు. ఒక్కోసారి ప్రాణం ఇచ్చే స్నేహితుడు పక్కనే ఉన్నాడు అంటే జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. కొన్నిసార్లు ఎవరు సాయం చేయకుండా మంచి స్నేహితుడు సాయం చేసి ఆపద నుంచి గట్టెక్కిస్తాడు. అయితే స్నేహం చేసే ముందు ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మంచి స్నేహం వల్ల జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందో.. చెడు స్నేహం వల్ల అంతే నష్టాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల స్నేహం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే స్నేహబంధం అనేది శాశ్వతంగా ఉండాలంటే ఈ పనులను ఎప్పటికీ చేయకూడదు అని కొందరు చెబుతున్నారు. అవేంటంటే?
Also Read: ‘కల్కి’ లాంటి ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిన రామ్ చరణ్..డైరెక్టర్ ఎవరంటే!
ఇద్దరు స్నేహితులుగా మారారు అంటే వారి మధ్య మాటల విషయంలో గానీ.. చేతల విషయంలో గానీ సత్సంబంధాలు ఉన్నట్లే అనుకోవాలి. అంటే ఒకరికి ఒకరు గౌరవం ఇస్తున్నారని అనుకోవాలి. ఒకరి మాట మరొకరు వింటున్నారని తెలుసుకోవాలి. అయితే వీటిని ఎప్పటికీ పాటించడం వల్ల వారి స్నేహం శాశ్వతంగా కొనసాగుతుంది. అంటే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఏదైనా విషయంలో వాదన చేస్తే.. మరో వ్యక్తి దానికి అంగీకరిస్తేనే ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది. అలా కాకుండా ఆ వ్యక్తి మాటలు ఎదుటివారు వ్యతిరేకిస్తే వారిద్దరి మధ్య స్నేహం చెడిపోతుంది. ఇలా స్నేహబంధం చెడిపోకుండా ఉండాలంటే వాదన లేకుండా చూసుకోవాలి. కొన్ని విషయాలు నచ్చకపోయినా అతనితో స్నేహం చేయాలని అనిపిస్తే వారి వాదనకు అంగీకరించడమే సరైన న్యాయం అని అనిపించుకుంటుంది.
మంచి స్నేహితులుగా మారాలంటే వారి మధ్య ఎటువంటి ఆర్థిక వ్యవహారాలు ఉండకూడదు. ఎందుకంటే డబ్బు వల్ల ఎప్పటికైనా సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఎంత మంచి వారైనా చిన్న ఆర్థిక వ్యవహారంలో వివాదం తలెత్తుతుంది. దీంతో ఒకరిపై ఒకరికి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అందువల్ల స్నేహితుల మధ్య ఎప్పుడు గానీ ఆర్థిక వ్యవహారాలు చేయకుండా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు చేసే వారితో మంచి స్నేహితులు అని అనుకోకుండా ఉండాలి. ఎందుకంటే డబ్బు వ్యవహారం జరిపేటప్పుడు దానిని వ్యాపార కోణంలో మాత్రమే చూడాలి. ఇక్కడ స్నేహం బంధం అనేది చూడకుండా ఉండాలి.
Also Read: పునర్జన్మ నేపథ్యం లో ‘హరి హర వీరమల్లు’..పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
ఇలా ఈ రెండు విషయాలను పకడ్బందీగా పాటిస్తే ఇద్దరి మధ్య స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు వీలు కాకపోతే కనీసం వారానికి ఒకసారైనా స్నేహితులతో ఉల్లాసంగా ఉండాలని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే స్నేహితులతో గడపడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీంతో గుండె సమస్యలు దూరమవుతుంది. ప్రస్తుత కాలంలో ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం స్నేహితులను కలిసి అవకాశం ఉండకుండా ఉంది. అయితే వారంలో ఒకసారి అయినా స్నేహితులతో కలిసి మాట్లాడడం లేదా పార్టీలు చేసుకోవడం వల్ల ఎంతో ఉల్లాసంగా మారుతారు. అందువల్ల స్నేహితులను ఎప్పటికీ దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది.