Pawan Hari Hara Story: మరో రెండు వారాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక నిర్మాత మొండిపPawan Hari Hara Story: పునర్జన్మ నేపథ్యం లో ‘హరి హర వీరమల్లు’..పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!ట్టు, గుండె ధైర్యం కి నిదర్శనమే ఈ చిత్రం. భారీ బడ్జెట్ సినిమాని నిర్మించడమే ఒక పెద్ద టాస్క్. దానికి తోడు 5 సంవత్సరాలు అనేక కారణాల చేత వాయిదా పడితే ఏ రేంజ్ వడ్డీలు పడుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. AM రత్నం అందరి లాగా రెగ్యులర్ నిర్మాత కాదు, చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఇష్టం తో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమాని మొదలు పెట్టి సగానికి పైగా పూర్తి చేసిన డైరెక్టర్ క్రిష్ మధ్యలో తప్పుకున్నాడు. వేరే నిర్మాత అయితే ఇక నా వల్ల కాదు బాబోయ్ అని సినిమాని మధ్యలోనే వదిలేసావారు.
Also Read:
కానీ AM రత్నం మొండిపట్టు పట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఎట్టకేలకు ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. గతం తో పోలిస్తే ఈసారి పది రెట్లు బెటర్ ట్రెండ్ నడుస్తుంది. నిర్మాతకు ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. అయితే ఈ సినిమా స్టోరీ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. అది ఏమిటంటే ఇది పునర్జన్మ నేపథ్యం లో తెరకెక్కిన సినిమా అని. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రాల్లో తీవ్రమైన వరదల ద్వారా నీళ్లలో ఆకలి అరుపులతో ఒక బిడ్డ అరుపులు వినిపిస్తూ ఉంటుంది. ఆ బిడ్డని ఒక పూజారి దత్తత తీసుకొని, హరి(మహావిష్ణువు), హర (మహాశివుడు) అనుగ్రహం తో ఆ బిడ్డ పుట్టినట్టు కొన్ని సందర్భాలను సినిమాలో చూపిస్తారట. ఈ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని సమాచారం.
#HariHaraVeeraMallu #HHVMTrailer pic.twitter.com/vzSOOWNHpD
— DeWara2 ᴺᵀᴿᴺᵉᵉˡ (@DragonNTRneeL) July 3, 2025
ఔరంగజేబు క్రూరత్వం ఆరోజుల్లో ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హిందూ మతంపై ఆయన చేసిన ఉన్మాదం అంతా ఇంతా కాదు. మతమార్పిడి చేసుకోమని బలవంతం చేయడం, ఒప్పుకోని వారిని కనికరం లేకుండా నరికి చంపేయడం, హిందూ దేవాలయాలను కూల్చేయడం, ఇలా ఒక్కటా రెండా, ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన అతన్ని అడ్డుకోవడానికి శివుడు, విష్ణువు కలిసి మనిషి రూపం లో జన్మించారని, ఆ మనిషే ‘హరి హర వీరమల్లు’ అని సినిమాలో ఒక సీక్వెన్స్ లో చూపిస్తారట. ఈ సీక్వెన్స్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎవ్వరూ చూడని సన్నివేశాలను ఇందులో చూపించబోతున్నారట. ట్రైలర్ లో కనిపించిన చివరి షాట్ ‘ఆంధీ వచ్చేసింది’ అనేది ఈ సినిమా క్లైమాక్స్ అట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చాలానే ఉందని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో ఉంటుందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.