Benefits of Power Napping: దేశంలోని ప్రజల జీవనశైలి రోజురోజుకు మారుతోంది. మారుతున్న జీవనశైలి వల్ల చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. నిద్ర తక్కువైన వాళ్లలో ఎక్కువమంది పగటిపూట అలసిపోతున్నారు. అలాంటి వాళ్లు పగటిపూట నిద్రపోతే మంచిది. పగటిపూట గంట లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోవడాన్ని పవర్ ఎన్ఎపి అని పిలుస్తారు. పగటిపూట నిద్రపోవడం వల్ల ఏకంగా 5 ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
మధ్యాహ్నం గంట కంటే తక్కువ సమయం మాత్రమే నిద్రపోవాలి. ఎక్కువ సమయం నిద్రపోతే ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిద్ర నియంత్రణలో లేకపోతే హృదయ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పగటిపూట గంట కంటే తక్కువ సమయం నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఉపశమనం లభిస్తుంది.
పగటిపూట నిద్రించడం వల హార్ట్ ఎటాక్ రాకుండా హృదయాన్ని సురక్షితంగా ఉంచుకునే అవకాశాలు ఉంటాయి. పగటి నిద్ర వల్ల సులభంగా జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. పగటినిద్ర మెదడును అలర్ట్ చేసి మేల్కొన్న తర్వాత యాక్టివ్ గా ఉండే విధంగా చేస్తుంది. నిద్రలో శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్స్ లో సైటోకిన్స్ కూడా ఒకటి. అనారోగ్యానికి గురైన సమయంలో రెస్ట్ తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
పగలు, రాత్రి ఎక్కువ సమయం పని చేసేవాళ్లకు మధ్యాహ్న నిద్ర మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడికి గురైన సమయంలో నిద్రపోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.