IBM Recruitment 2021: ప్రముఖ ఐటీ సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్(ఐబీఎం) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఐబీఎం కంపెనీ ద్వారా దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కోర్సులను పూర్తి చేసి ఉద్యోగంలో చేరాలని భావించే వాళ్లకు ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి. యాప్స్ ను రూపొందించడం, టెస్ట్ చేయడం, డీబగ్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్, కోడ్స్ రాయడంపై ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి.
ఎవరైతే వీటిపై ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్లు ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెషర్స్ మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ తో ఎంఎస్సీ, ఎంసీఏ, బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రీలెవెల్ లేదా ఫ్రెషర్ జాబ్స్ కావడంతో ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.ibm.com/in-en/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హోం పేజీలో కెరీర్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుని ఎంట్రీ లెవెల్ లేదా ఇంటర్న్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రాంతాల వారీగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించే అవకాశాలు ఉంటాయి.
నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.