Homeలైఫ్ స్టైల్Chewing Cloves: రాత్రి సమయంలో లవంగం నమిలితే ఏం జరుగుతుందో తెలుసా?

Chewing Cloves: రాత్రి సమయంలో లవంగం నమిలితే ఏం జరుగుతుందో తెలుసా?

Chewing Cloves: మానవ శరీర ఆరోగ్యానికి ప్రస్తుత రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొందరు రాత్రి సమయంలో ప్రాసెస్ లేదా హెవీ ఫుడ్ తీసుకొని నిద్రపోయేటప్పుడు అవస్థలు పడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీనివల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం కావడానికి ఇంట్లోనే అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిలో లవంగం ఒకటి. లవంగం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ, శ్వాస కోస ఆరోగ్యం, నిద్ర నాణ్యత మెరుగుపడేలా సహాయపడుతుంది. అయితే ఈ లవంగంను ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి?

ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందరికి సరైన నిద్ర రావాలంటే చాలా కష్టంగా మారింది. అందుకు తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడమే అని తెలుస్తోంది. ఆహారం జీర్ణం అయితే ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన నిద్ర వస్తుంది. అయితే ఆహారం జీర్ణం కావడానికి రోజు రాత్రి పడుకునే ముందు ఒక లవంగం ను నవలడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లవంగంలో యూజేనాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహించి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే లవంగం తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా కూడా తగ్గి దుర్వాసన రాకుండా కాపాడుతుంది.

శ్వాస కోస సమస్యలతో బాధపడే వారికి లవంగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దగ్గు, కఫం, గొంతు మంట వంటి సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉంటారు. అలాగే నాణ్యమైన నిద్ర కోసం కూడా దీనిని తీసుకోవచ్చు. లవంగంలో ఉన్న సహజ సుగంధం నరాలను శాంతింప చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలో తరచూ మెలుకువ రావడం అసహనం వంటి సమస్యలు తగ్గుతాయి.

అయితే లవంగం తో పాటు మరికొన్ని చిట్కాలు పాటించడం వల్ల రాత్రి అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇందులో భాగంగా భోజనానికి ముందు వేడి నీరు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు శరీరం సహకరిస్తుంది. కడుపులో ఉండే ఆహారనాళాలు రిలాక్స్ గా మరి ఆహారాన్ని సులభంగా హరి ఎలా చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఇది తప్పనిసరిగా చేయాలి. ఇదే సమయంలో రాత్రి సమయంలో టి, కాఫీలకు దూరంగా ఉండటమే మంచిది. వీటిని తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. టిఫిన్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి జీర్ణవ్యవస్థ పై పొత్తిని పెంచుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో ఇంట్లోనే లభించే ఇలాంటి వస్తువులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది అని అనుకుంటున్నారు

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version