spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Controversy: జగన్ కోసం చంద్రబాబు కొత్త నినాదం!

Tirumala Controversy: జగన్ కోసం చంద్రబాబు కొత్త నినాదం!

Tirumala Controversy: భారతీయ జనతా పార్టీతో( Bhartiya Janata Party) సుదీర్ఘకాలం ప్రయాణిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. అయితే ఎన్నడూ హిందుత్వ వాదాన్ని తెలుగుదేశం పార్టీ తెర ముందుకు తేలేదు. చంద్రబాబు సైతం ఎన్నడు మాట్లాడిన దాఖలాలు లేవు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా హిందుత్వవాదంపై మొగ్గు చూపలేదు. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేయడానికి హిందూ ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు చంద్రబాబు. ఇది చంద్రబాబులో స్పష్టమైన మార్పు అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు తిరుమల ఏడుకొండల వాడి ప్రతిష్టను తగ్గించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని కొత్త నినాదాన్ని అందుకున్నారు చంద్రబాబు. ఏపీలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బంది కలిగించే విషయమే.
రెండేళ్ల తర్వాత ఒకే తాటిపైకి కూటమి..
అయితే ఏపీలో కూటమి ఐక్యత లేకుండా పోతేనే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి అవకాశం దక్కుతుందని విజయసాయి రెడ్డి లాంటి వారు కూడా వ్యాఖ్యానించారు. కానీ ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేయడం ప్రారంభించిందో.. ఆ మూడు పార్టీల మధ్య బంధం మరింతగా పెరిగింది. ఈ రెండేళ్లలో తొలిసారి కూటమి నేతలు ఒకే వేదిక పైకి వచ్చారు. తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకురావడం తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. కూటమి ఐక్యత ఒకవైపు.. హిందుత్వవాదం ఇంకోవైపు.. గోవిందుడి పైనే కుట్రగా అభివర్ణించడం ద్వారా ఓటు బ్యాంకు ఏకీకరణ మరోవైపు అన్నది వ్యూహంగా కనిపిస్తోంది.
ఎన్నడూ ఇటువంటి వ్యాఖ్యలు లేవు..
ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు చంద్రబాబు( CM Chandrababu). ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా కూడా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు రెండోసారి కూడా ఆయనే బాధ్యతలు చేపట్టారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా, జాతీయస్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాల సారధిగా కూడా వ్యవహరించారు. కానీ ఏ రోజు కూడా ఆయన హిందుత్వ వాదాన్ని తెరపైకి తేలేదు. జగన్మోహన్ రెడ్డి అవినీతి, వివేకానంద రెడ్డి హత్య వంటి అంశాలను ఎక్కువగా ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు తిరుమల వెంకన్న ప్రస్తావన తీసుకురావడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు అర్థమవుతుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో..
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version