Behavioral Problems: ప్రతి ఒక్కరు తమ పిల్లలను బాగా పెంచాలని కలలు కంటుంటారు. వారి అభిరుచులు, అలవాట్లు బాగుండాలిని ఆశిస్తారు. ఈ నేపథ్యంలో వారి పెంపకంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. తమ సంతానం లుగురిలో మంచి వారుగా గుర్తింపు పొందాలని కోరుకుంటారు. ఇందులో భాగంగానే వారిని తీర్చిదిద్దుతారు. దీనికి అనుగుణంగానే వారిని మార్చుకుంటారు.
బూతులు మాట్లాడకూడదు
పిల్లల ముందు ఎప్పుడు చెడు అర్థాలు వచ్చే మాటలు మాట్లాడకూడదు. దీంతో ఆ మాటలు ఎప్పుడో ఒకసారి మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. దీంతో వారికి బూతులు అలవాటైతే కష్టమే. ఫలానా వారి పిల్లలు ఇలా మాట్లాడతారని అనుకుంటారు. పరువు పోతుంది. ఈ నేపథ్యంలో బూతు మాటలు మాట్లాడితే దండించాలి. మళ్లీ అలాంటి మాటలు మాట్టాడొద్దని హితవు చెప్పాలి.
పిల్లల ప్రవర్తలో మార్పు రావాలి
పిల్లల ప్రవర్తనలో మార్పు రావాలి. మంచి మాటలు మాట్లాడాలి. ఒకవేళ చెడు మాటలు వచ్చినా వాటిని తక్షణమే నివారించాలి. లేకపోతే వారు భవిష్యత్ లో సరైన దారిలో నడవకపోతే కష్టాలు ఎదురవుతాయి. సమాజంలో వారి మాటలు కీడు చేస్తాయి. మంచి మాటలు మంచిని పెంచుతాయి. చెడు మాటలు మన కీర్తిని చెడగొడతాయి. ఈ క్రమంలో మన ప్రవర్తనపై చెడు ప్రభావాలు చూపకుండా చూసుకోవాలి.
ఉపేక్షించకూడదు
పిల్లలు ఎవరినైనా బూతు మాటలు అంటే వెంటనే వారించాలి. అలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడొద్దని వారికి క్షమాపణలు చెప్పించాలి. మరోసారి ఇలాంటి మాటలు రిపీట్ కావొద్దని సీరియస్ గా సూచించాలి. మన మాటలే మనకు గౌరవాన్ని ఇస్తాయి. నీచంగా మాట్లాడితే చెడు ఫలితాలు సౌమ్యంగా మాట్లాడితే మంచి ఫలితాలు ఇస్తాయి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు.