Jobs In Defence: బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 52 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సివిలియన్ పోస్టుల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది. సివిల్ ట్రేడ్ ఇన్‌స్ట్రక్టర్, స్టోర్ కీపర్, ఎల్‌డీసీ ఉద్యోగ ఖాళీలతో పాటు బార్బర్, వాషర్‌మెన్, లస్కర్, ఎంటీఎస్, కుక్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. మెట్రిక్యులేషన్, ఇంటర్, తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక్ ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. కమాండెంట్ బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్, రూర్కీ ఉత్తరప్రదేశ్ అడ్రస్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
Also Read: Pavan Kalyan In Fire: తగ్గేదేలే..! పవన్ ప్లవర్ కాదు.. ఫైర్.. ఇక అంటుకోవడం ఖాయం!
ఆఫ్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ్ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://joinindianarmy.nic.in/authentication.aspx లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో మేలు జరగనుందని చెప్పవచ్చు.
Also Read: Nagababu: జగన్ మళ్లీ గెలిస్తే వస్తే ఏపీ నుంచి వలసలు : నాగబాబు సంచలన వ్యాఖ్యలు