Monsoon: వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లగా మారింది.. చల్లటి వాతావరణం లో అనేక జంతువులు బయటికి వస్తాయి. అందులో సరిసృపాల జాతికి చెందిన పాములు ముఖ్యమైనవి.. వర్షాకాలంలో ఇవి మొక్కల కింద లేదా చెట్ల కింద తలదాచుకుంటాయి. ఆదమర్చి వీటిపై కాలు లేదా చేయి వేస్తే అంతే సంగతులు. అలాంటి ప్రమాదం రాకముందే జాగ్రత్తపడాలి. ఇందుకు ఏం చేయాలంటే..
గడ్డి పెరగకుండా చూడాలి
ఇంటి పరిసరాల్లో వర్షాకాలం గడ్డి విస్తారంగా పెరుగుతుంది. ఈ గడ్డి కింద పాములు, ఇతర విష జంతువులు తల దాచుకుంటాయి. అలాంటప్పుడు గడ్డి పెరగకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు మూడు రోజులకు ఒకసారి కట్ చేసుకోవాలి. అప్పుడే అది పాములకు ఆవాసంగా మారదు.
విస్తారంగా పెరిగే మొక్కలు
వీటిని బొటానికల్ పరిభాషలో గ్రౌండ్ కవర్ ప్లాంట్స్ అంటారు. ఈ మొక్కల ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. కాండం చాలా చిన్నగా ఉండడంతో విషసర్పాలు తల దాచుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ మొక్కలను ఎప్పటికప్పుడు విస్తారంగా పెరగకుండా కట్ చేయడమే మంచిది.
పండ్ల పొదలు
వానా కాలంలో తీగ జాతికి చెందిన మొక్కలు పండ్లను కాస్తాయి.. ఈ పండ్ల కోసం కీటకాలు, ఇతర పురుగులు వస్తాయి. వీటిని ఆహారంగా తీసుకునేందుకు తొండలు, ఇతర బల్లుల వంటివి వస్తాయి. వాటిని తినేందుకు పాములు ఆ పరిసర ప్రాంతాల్లో తిష్ట వేసుకుని ఉంటాయి. ఇలాంటప్పుడు అలాంటి పొదల్లో పండ్లను త్వరగా కోసుకుని, ఎప్పటికప్పుడు ఆకులను శుభ్రం చేసుకోవడమే మంచిది.
పుష్పించే మొక్కలు
వానా కాలంలో చాలావరకు మొక్కలు పుష్పిస్తాయి. ఈ పుష్పాల్లో ఉన్న మకరందం కోసం ఇతర కీటక జాతికి చెందిన జీవులు వస్తుంటాయి. వాటిని ఆహారంగా తీసుకునేందుకు ఎలుకలు, ఇతర జంతువులు ఆ ప్రాంతంలో తిరగాడుతూ ఉంటాయి. వాటిని తినేందుకు సర్పాలు, ఇతర విష జంతువులు తిరుగుతుంటాయి. అలాంటప్పుడు పూల మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది.
రాక్ గార్డెన్స్
చాలామంది ఇళ్లల్లో రాక్ గార్డెన్స్ పేరుతో పుష్పించే మొక్కలను పెంచుకుంటుంటారు. ఇవి చూసేందుకు చాలా ఆకర్షణంగా కనిపిస్తాయి. అందంగా కూడా ఉంటాయి. అయితే ఈ మొక్కల ఆకులు, పుష్పాలు దళసరిగా ఉంటాయి కాబట్టి.. ఇవి సర్పాలు, ఇతర జంతువులకు ఆశ్రయంగా మారుతాయి. అలాంటప్పుడు ఇలాంటి మొక్కలను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడం లేదా పుష్పాలను కోయడం వంటి పనులు చేపట్టాలి. అప్పుడే విష సర్పాలు రాక్ గార్డెన్ కిందకు రాకుండా అడ్డుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Be careful during monsoons from snake bites
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com