Bay Leaf Benefits: జుట్టు సమస్యల్లో చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. వర్షాకాలం వస్తే చాలు ఈ సమస్య మరింత వేధిస్తుంటుంది. ఇక చుండు ఎక్కువ ఉంటే జట్టు కూడా రాలుతుంటుంది. అందుకే డాండ్రఫ్ షాంపూలను వాడుతుంటారు. అయితే మీరు ఎక్కువ కష్టపడకుండా జస్ట్ బిర్యానీ ఆకుతో కింద చెప్పిన విధంగా చేయండి. మీ చుండ్రు సులభంగా మాయం అవుతుంది. అంతేకాదు కుదుళ్లలో వచ్చే దురద, దద్దుర్లు, మంట నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని, జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది.
టిప్ :1 ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొన్ని బిర్యానీ ఆకులు, వేపాకులు వేసుకొని దాన్ని స్టౌ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ ఆకులు ఉడికిన తర్వాత చల్లార్చి ఆకులను మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేపనూనె, అలోవెరా జెల్, ఉసిరి పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మొత్తాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మాడుకు పట్టేలా అప్లై చేసి వేళ్లతో మసాజ్ చేసుకోండి.ఇలానే ఓ 15 నిమిషాలు వదిలేయండి. తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
టిప్. 2: బిర్యానీ ఆకులను నీటిలో ఉడకబెట్టి పేస్టులా చేసుకోండి. ఇందులో కొబ్బరి నూనె కలిపి మాడుకు పట్టించాలి. ఇలా చేస్తే కూడా దురద తగ్గుతుంది. అంతేకాదు తలపై ఉన్న ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి అంటున్నారు నిపుణులు. అయితే ఓ పాత్రలో లీటర్ వాటర్ తీసుకొని అందులో కొన్ని బిర్యానీ ఆకులు వేసి ఆ నీరు సగానికి వచ్చే వరకు మరిగించాలి. ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి. మరీ ముఖ్యంగా మాడుకు తగిలేలా ఈ నీటిని పోస్తుండాలి. ఇలా చేస్తే కూడా చుండ్రు సమస్య తగ్గి జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.
ఈ బిర్యానీ ఆకు రెమెడీస్ వారానికి రెండు నుంచి మూడు సార్లు ట్రై చేస్తే.. చుండ్రు సమస్య, ఇతర జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని సలహా ఇస్తున్నారు నిపుణులు. అంతేకాదు జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది. ఈ బిర్యానీ ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు సమస్యను నివారించడంలో చాలా బాగా పనిచేస్తాయి.