Weight Loss Tips: వేగంగా బరువు తగ్గడానికి ఈ 6 పదార్థాలను దూరంగా ఉంచండి.. అవేంటంటే?

కొంతమందికి ఆహారం తీసుకున్న తరువాత సోడా తాగడం అలవాటు. సోడా తాగడం వల్ల తొందరగా డైజేషన్ అవుతుందని అనుకుంటారు. కానీ సోడాలో జీర్ణక్రియ కావడానికి ఎలాంటి కారకాలు ఉండవు.

Written By: Chai Muchhata, Updated On : September 30, 2023 7:25 pm

Weight Loss Tips

Follow us on

Weight Loss Tips: నేటి కాలంలో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. శరీర శ్రమ అధికంగా లేకపోవడంతో పాటు ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుండడంతో స్థాయికి మించి కొవ్వు పెరిగిపోతుంది. దీంతో బరువు పెరిగి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నారు. కొందరు డైట్ ను పాటిస్తున్నారు. మరికొందరు ప్రత్యేక మెడిసిన్ తీసుకుంటున్నారు. అయితే క్రమశిక్షణమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువును తొందరగా తగ్గే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ 6 పద్ధతుల్లో ఆహారాన్ని తీసుకుంటే వెయిట్ లాస్ ను తొందరగా గ్రహిస్తారని అంటున్నారు.

ప్రాసెస్ ఫుడ్:
ఇప్పుుడున్న వారిలో చాలా మంది టేస్టీ ఫుడ్ కోసం ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో వండిన ఆహారం కాకుండా హోటళ్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని రాత్రి నిద్రపోయే ముందు తీసుకోకూడదు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పడుకున్న తరువాత ఇవి తొందరగా డైజేషన్ కావు. అందువల్ల రాత్రి పూట ఇలాంటి ఆహారం జోలికి వెళ్లకుండా ఉండడం ద్వారా బరువు పెరగకుండా కంట్రోల్ అవుతుంది.

సోడా:
కొంతమందికి ఆహారం తీసుకున్న తరువాత సోడా తాగడం అలవాటు. సోడా తాగడం వల్ల తొందరగా డైజేషన్ అవుతుందని అనుకుంటారు. కానీ సోడాలో జీర్ణక్రియ కావడానికి ఎలాంటి కారకాలు ఉండవు. పైగా ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది. అందువల్ల ఎక్కువగా సోడా తీసుకోవడం మానేయడం మంచింది.

జంక్ ఫుడ్:
ఇంట్లో వండిన ఆహారం కంటే హోటళ్లలో, బేకరీల్లో దొరికే పిజ్జా, బర్గర్లు ఎక్కువ రుచిని కలిగి ఉంటాయి. అయితే ఇందులో రుచి కోసం వివిధ పదార్థాలను కలుపుతారన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే వీటినే ఎక్కువగా తీసుకుంటారు. ఇవి శుద్ది చేసిన పిండిపదార్థాలు కావడంతో పాటు చక్కెర నిల్వలు ఎక్కువగా కలిగిన ఫుడ్. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. దీనిని తగ్గించడం వల్ల బరువు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

గింజలు:
సాధారణ ఆహారం కంటే గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని క్రమ పద్ధతిలో తీసుకోవాలి. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లా.. లేదా మధ్యాహ్నం స్నాక్స్ లో భాగంగా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. కానీ రాత్రి పడుకునే ముందు వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది.

పండ్ల రసం:
పండ రసం తీసుకోవడం వల్ల తక్షణ ఎనర్జీ వస్తుంది. అయితే పండ్లు ఎక్కువగా చక్కెరను కలిగి ఉంటాయి. వీటిని భోజనం తరువాత తీసుకోవడం వల్ల అసిడిటీ వస్తుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్:
బయట దొరికే వివిధ రకాల వంటకాలు ఎంతో ఆకర్షిస్తాయి. వీటిని తరుచుగా తినవడం వల్ల ఎక్కువ కేలరీలు కలిగి బరువును పెంచుతాయి. అయితే వీటి జోలికి వెళ్లకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.