Aunts and Daughters-in-law : అత్త కోడలు అంటే ముందుగా చాలా మందికి గొడవలే గుర్తు వస్తాయి. ఈ రిలేషన్ అలా మారిపోయింది మరీ. ఇక అత్త లేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణమంతురాలు అనే మాట మీరు వినే ఉంటారు కదా ఎందుకు అంటే.. అత్తా, కోడళ్ల మధ్య సఖ్యత ఎప్పుడూ ఉండదని.. వారి మధ్య ఏదో ఒక విషయంలో సమస్యలు వస్తూనే ఉంటాయి అని ఈ మాట అర్థం. అయితే ఏ ఇంట్లో అయితే… అత్తా, కోడళ్ల మధ్య సమస్యలు లేకుండా… సంతోషంగా ఉంటారో..ఆ ఇల్లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదొక అందాల హరివిల్లు.
అయితే, ఇల్లు సంతోషంగా ఉండాలంటే.. అత్తగారు కొన్ని విషయాలను కోడలితో ఎప్పటికీ చెప్పకూడదట. మరి.. ఎలాంటి విషయాలు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఏం చేసినా తప్పులు వెతకడం మానుకోవాలి అంటున్నారు నిపుణులు. అంటే.. మా కాలంలో ఇవన్నీ ఉండేవి కావు. మా ఇంట్లో ఇలాంటివన్నీ చేయడానికి వీలు లేదు. లాంటి మాటలు చెప్పకూడదు. ఎందుకంటే.. కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉండాలి. మీకు కాలం ఉన్నట్లు.. ఇప్పటి కాలం, ఈ కాలం అమ్మాయిలు ఉండరు అనే విషయం కూడా తెలుసుకోవాలి. మీ ఆలోచనలకు తగినట్లు ఈ కాలం అమ్మాయిల ఆలోచనలు ఉండవని తెలుసుకోవాలి.
మీ కొడుకును పెళ్లి చేసుకోవడం వల్ల తన ఇల్లును వదిలి మీ ఇంటికి వస్తుంది కాబట్టి కూతురు లా భావించాలి. ఆమె ఒక్కసారి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటే.. మీ ఇల్లు..తన ఇల్లు కూడా అవుతుంది. ఆ విషయం పట్టించుకోకుండా ప్రతిసారీ కోడలు ఏం చేసినా.. ఇది నీ ఇల్లు కాదు.. కాని పదే పదే అనడం మంచిది కాదు. ఇలాంటి మాటలు ఆమెను బాధపెడతాయి. ఆమె కూడా మీ కుటుంబ సభ్యురాలని అనుకోవాలి.
కోడలు ఇంట్లో ఏదైనా పొరపాట్లు చేస్తే.. తల్లిలా క్షమించాలి. అంతేకానీ… నీ పెంపకం సరిగా లేదని, మీ పేరెంట్స్ ఇలా పెంచారా? అంటూ ఆమెతో పాటు వాళ్ల పేరెంట్స్ ని కూడా తిట్టడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఈ మాటలు పొరపాటున కూడా ఆమెను అనకూడదు. మీ కోడలికి మీ మీద, మీ కొడుకు మీద మర్యాద కూడా తగ్గి పోయే అవకాశం ఉంది.
కుటుంబంలో ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకుంటుంటే.. అదుదలో మీ కోడలికి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది అని తెలుసుకోవాలి. అంతేకానీ ఆమె మాట్లాడుతుంటే.. నీకేమీ తెలీదు, నోర్మూసుకో అంటే చెప్పడం మంచిది కాదు. మీ కోడలిని ఏ విషయంలో అయినా మీ కూతురితో పోల్చవద్దు. పొరపాటున కూడా నా కూతురు అయితే ఇలా చేస్తుంది నువ్వు అలా చేస్తున్నావ్ అంటూ ఇబ్బంది పెట్టవద్దు. ఈ మాటలు కూడా ఆమెను ఇబ్బంది పెడతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Aunts should not be like this with daughters in law
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com