Vasthu Tips : డబ్బు సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ దానిని నిలబెట్టుకోవడంలో కొందరు పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు ఏమాత్రం నిలిచి ఉండదు. ఏదో రకంగా ఖర్చు అవుతూనే ఉంటుంది. అలాగే మరికొందరికి ఆదాయం ఎక్కువగా వచ్చిన ఖర్చులు అంతకుమించి ఉంటాయి. అయితే ఇంట్లోని కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం గా ఉంచడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. డబ్బు ఇంట్లో ఎక్కువగా నిల్వ ఉండాలంటే కుబేరుడి ఆశీస్సులు ఉండాలని అంటారు. అంతేకాకుండా డబ్బులు నిలువచేసే వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఉంచుకోవాలని తెలుపుతున్నారు. అయితే అందుకోసం ఏం చేయాలి?
Also Read : వంటగదిలో కటింగ్ బోర్డులను ఉపయోగిస్తున్నారా? చాలా డేంజర్
చాలామంది డబ్బులు లేదా నగలను ఇంట్లోని లాకర్లో పెట్టి భద్రపరుచుకుంటారు. అయితే ఈ లాకర్ సవ్యమైన దిశలో ఉంటేనే ఇంట్లో ధనం నిలుస్తూ ఉంటుంది. లేకుంటే అందులో ఎంత డబ్బు ఉంచినా ఖర్చు అవుతూనే ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం లాకర్ను గోడ నుంచి ఒక అంగుళం దూరంలో ఉంచడం మంచిది. అంటే లాకర్ మొత్తం గోడకు ఉంచడం వల్ల నెగటివ్ శక్తి ఏర్పడుతుంది. దీంతో ఆ డబ్బు ఎప్పటికీ ఖర్చవుతుంది. అలాగే డబ్బులు దాచి ఉంచే లాకర్ లేదా బీరువాను సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. వీటిని ఉత్తర దిశ లేదా దక్షిణం తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఉత్తర దిశలో స్థలం లేకపోతే మాత్రమే ఇలా చేయాలి.
డబ్బులు దాచి ఉంచే వస్తువు లోహంతో చేసి ఉండాలి. ఎందుకంటే లోహంతో ఉండే బీరువా లేదా లాకర్ శక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఇందులోకి ఆక్సిజన్ వెళ్లే అవకాశం ఉండడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ లాకరు పూర్తిగా నేలను తాకినట్టు ఉండకూడదు. అలా చేస్తే ఆర్థిక శక్తి తగ్గిపోతుంది. దీంతో ఇంట్లో డబ్బులు ఉండడానికి ఆస్కారం ఉండదు. అలాగే డబ్బులు ఎక్కువగా నిల్వ ఉండడానికి వీటిని భద్రపరిచే వస్తువు రంగు కూడా ముఖ్యమే. వాస్తు శాస్త్ర ప్రకారం ఈ లాకర్ పసుపు రంగులో ఉండాలి. ఇది ఆనందం లేదా శ్రేయస్సుకు మంచిది. అంతేకాకుండా ఈ రంగు గల వస్తువులో డబ్బులు ఉంచడం వల్ల ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా డబ్బు ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
లాకర్లలో డబ్బులు దాచి ఉంచినప్పుడు అందులో అద్దంలాంటి వస్తువు అసలు ఉండకూడదు. ఎందుకంటే అందులో అద్దం ఉండడంవల్ల అది ప్రతికూల శక్తిని ప్రవహింపజేస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లాకర్లలో డబ్బు దాచినప్పుడు అవి కనిపించేలా ఉండాలి. అంటే వాటిని మరో కవర్లలో లేదా.. ఇతర సంచిలో ఉంచి బీరువాలో ఉంచకూడదు. అలా చేస్తే చెడుపరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు నిల్వ ఉండే బీరువాలో లక్ష్మీదేవి ప్రతిమ ఉండడం వల్ల మరీ మంచిది. అంతేకాకుండా అదే ఈ బీరువాను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అందులో చెత్తాచెదారం ఉన్న డబ్బు నిలకుండా ఉంటుంది.