Astrology On Dreams: మనకు జీవితంలో ఎన్నో కలలు వస్తుంటాయి. వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. దీంతో కలలు రావడం సహజమే. కలల్లో కొన్ని హానికరమైనవి మరికొన్ని మంచి చేసేవి ఉండటం గమనార్హం. మనిషి జీవితంలో ఎన్ని సంవత్సరాలు కలలు కంటామో తెలిస్తే షాకే. నిద్ర పడితే చాలు కలలు కనడం పరిపాటే. నిద్రలోకి జారుకోవడంతో మనం ఎక్కడకో వెళ్లినట్లు కలలు వస్తుంటాయి. ఏదో చేసినట్లు అనిపిస్తుంది. కొన్ని మనకు మంచి చేసేవి కొన్ని చెడు ఫలితాలు ఇచ్చేవి కూడా ఉంటాయి. కలలు ఎందుకు వస్తాయి? అవి వస్తే మనకు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.

మనిషి జీవితంలో దాదాపు ఆరేళ్లు కనడానికి కేటాయించబడుతుందంటే నమ్ముతారా? కానీ పలు అధ్యయనాలు ఇదే చెబుతున్నాయి. మనకు వచ్చే కలలు రకరకాలుగా ఉంటాయి. ఎత్తు నుంచి కింద పడిపోయినట్లు అనిపించడం, పాములు రావడం, దేవకన్యలు కనిపించడం, ఎక్కడో భయంకరమైన ప్రదేశాల్లో ఇరుక్కోవడం, అతీంద్రియ శక్తులు వచ్చినట్లు అనిపించడం వంటి కలలు వస్తూనే ఉంటాయి. ఇంకా తెలిసిన వాళ్లు చనిపోవడం, మనల్ని ఎవరో వెంబడించినట్లు అనిపించడం వంటివి వస్తూనే ఉండటం సహజం.
కలలో శృంగారం చేస్తున్నట్లు అనిపించడం, టీచర్లు కనిపించడం, పరీక్షలు రాయడం, తప్పడం, బాల్యంలోకి వెళ్లడం వంటివి ఎక్కువ మందికి వస్తుంటాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులే మనకు కలల రూపంలో వస్తాయిని చెబుతుంటారు. మనకు వచ్చే కలల ఆధారంగా మన భవిష్యత్ ఎలా ఉంటుందనే దానిపై కూడా అంచనాలు వేసుకోవచ్చని నిర్ధారిస్తారు. ఇలా మనకు జీవితంలో కలలు ఎన్నో ఫలితాలు తీసుకొస్తాయని నమ్ముతారు.
మనకు ఎలాంటి కలలు వస్తే మంచిది? ఎట్లాంటి కలలు వస్తే చెడు ఫలితాలు వస్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. గాలిలో ఎగిరినట్లు, నగ్నంగా నడిచినట్లు కలలు వస్తే కష్టాలు రావని చెబుతుంటారు. దేవతలు, గోవులు, అగ్ని, సరస్సులు, కన్య, ఫలాలు, నదులు, సముద్రాలు దాటడం, పర్వతాలు దాటడం వంటి కలలు వస్తే ఆరోగ్యం కలుగుతుంది. తూర్పు ఉత్తర దిక్కునకు పోయినట్లు, కోరుకున్న స్త్రీని పొందినట్లు, శవాన్ని చూసినట్లు కలలు వస్తే ప్రమాదమని విశ్వసిస్తారు.

కలలో కుంకుమ మరియు కస్తూరి కనిపిస్తే కీర్తి కలుగుతుంది. తామరపువ్వులు, గులాబీ పువ్వులు కనిపిస్తే ఆరోగ్యం, పుస్తకాలు, గ్రంథాలు కనిపిస్తే వికాసం, విద్యార్థుల మృతదేహాలు కనిపిస్తే వారిలో అభ్యాస నాణ్యత మెరుగుపడుతుంది. ఇలా కలలు మనకు ఎన్నో రకాల పరిణామాలు ఏర్పడటానికి కారణాలుగా నిలుస్తాయి. కలల్లో కూడా మనకు మంచి, చెడు ఫలితాలు రావడానికి దోహదపడతాయిని చెబుతుంటారు. కలలు వస్తే వాటిని గుర్తుంచుకోవడం కంటే మరిచిపోవడమే మంచిది.