Kushi Re Release Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఖుషి’ రీ రిలీజ్ లోను అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..మొదటి రోజు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండవ రోజు కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి అందరిని ఆశ్చర్యపర్చింది, ఎందుకంటే ఆ రేంజ్ గ్రాస్ మిగిలిన రీ రిలీజ్ లకు మొదటి రోజు కూడా ఉండదు.

అలా కేవలం రెండు రోజుల్లోనే 5 కోట్ల 90 లక్షల రూపాయిలు వసూలు చేసింది..కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో మాత్రమే కాకుండా ఈ సినిమా కర్ణాటక మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో కూడా సెన్సేషన్ సృష్టించింది..కర్ణాటక లో అయితే ఏకంగా 58 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది ఈ చిత్రం..భవిష్యత్తులో కూడా ఈ రికార్డు ని ఎవ్వరు బ్రేక్ చెయ్యలేరని చెప్పొచ్చు.
కేవలం రెండు రోజులతో ఈ సినిమా ఫుల్ రన్ అయిపోయింది అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటే..ఎందుకంటే మూడవ రోజు కూడా ఈ చిత్రానికి చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..ముఖ్యంగా హైదరాబాద్ లో మల్టిప్లెక్స్ షోస్ నిన్న రాత్రి దాదాపుగా అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయి..కేవలం నైజాం ప్రాంతం నుండే 3 వ రోజు 18 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం , అన్నీ ప్రాంతాలకు కలిపి 70 లక్షల రూపాయిల వరకు వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

అలా మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ చిత్రం 6 కోట్ల 58 లక్షల రూపాయిలు గ్రాస్ ని వసూలు చేసిందని..ఫుల్ రన్ లో కచ్చితంగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట..కేవలం నైజం ప్రాంతం నుండే ఈ సినిమా 2 కోట్ల 50 లక్షల గ్రాస్ ని వసూలు చేసిందని, ఫుల్ రన్ లో మూడు కోట్ల రూపాయిలు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.