
Cramps: చాలా మందికి చేతులు, కాళ్లకు తిమ్మిర్లు వస్తుంటాయి. కానీ కొద్ది సేపటికి మళ్లీ యథాతథ స్థితి వస్తుంది. కానీ అదేపనిగా తిమ్మిర్లు వస్తుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినట్లే లెక్క. దీంతో తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మద్యం తాగేవారు, షుగర్ ఉన్న వారిలో ఈ సమస్య కనిపించడం మామూలే. దీనికి ప్రధాన కారణం విటమిన్ బి12 లోపం అని చెబుతున్నారు.
మన శరీరంలో విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదల, శరీర నిర్మాణంలో విటమిన్ బి 12 సాయపడుతుంది. ఈ నేపథ్యంలో విటమిన్ బి 12 ప్రాధాన్యం ఎంతో ఉంది. శరీర భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా కాకపోతే తిమ్మిర్లు వస్తాయి. విటమిన్ బి12 లోపం వల్ల తిమ్మిర్లు, సయాటికా నొప్పులు, వెరికోస్ వెయిన్స్ వంటివి రావడానికి ఆస్కారం ఉంది.
విటమిన్ బి12 మాత్రల ద్వారా తీసుకోవచ్చు. ఆహారాల ద్వారా కూడా అందుతుంది. విటమిన్ బి12 తగినంత మోతాదు ఉన్నా తిమ్మిర్లు కొందరిలో వస్తుంటాయి. మన జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కూడా విటమిన్ బి 12 మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇలా విటమిన్ బి12 మన శరీరానికి ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో విటమిన్ బి12ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

విటమిన్ బి12 ఎక్కువగా లభించే ఆహారాల్లో పాలు, పాల పదార్థాలు, మాంసం, చేపలు వంటి వాటిల్లో ఉంటుంది. దీంతో వాటిని అధికంగా తీసుకోవడం మంచిది. తిమ్మిర్లు సమస్యతో బాధపడేవారు నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. చేతులు, కాళ్లకు కొబ్బరినూనెతో మర్ధన చేసుకోవాలి. దీంతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తిమ్మిర్లు రాకుండా ఉంటాయి.