Kids : చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉత్సాహంగా ఉండాలంటే మీరు పడుకునే రాత్రి నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం అస్సలు నిద్ర సరిగ్గా ఉండదు కదా. పిల్లలు సమయానికి అసలు నిద్రపోరు. దాని వల్ల పేరెంట్స్ కి అసలు నిద్ర ఉండదు. పిల్లలకు కూడా సరిగ్గా నిద్ర లేకపోతే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటారు. మరి మీ పిల్లలు పడుకోబెట్టిన వెంటనే పడుకోవడం లేదా? వారు త్వరగా పడుకుంటే బాగుండు అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ ఫాలో అవండి. పడుకోబెట్టిన వెంటనే నిద్ర పోతారు.
స్లీప్ రొటీన్..
పడుకోబెట్టిన వెంటనే పిల్లలు పడుకోవాలి అంటే వారికి స్లీప్ సర్కిల్ అలవాటు చేయాలి. ఒక్కో సమయానికి పడుకోబెట్టడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా వారిని ఒకే సమయానికి పడుకోబెట్టాలి. ఇలా చేయడం వల్ల వారికి అదే సమయానికి నిద్ర వస్తుంది. మీకు కూడా ఆ సమయానికి వారిని నిద్ర పుచ్చాలి అని ఐడియా ఉంటుంది. ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయాన్ని బ్రేక్ చేయవద్దు.
మధ్యాహ్నం నిద్ర
మూడు సంవత్సరాల తర్వాత పిల్లలను మధ్యాహ్నం నిద్ర పుచ్చకూడదు. మూడు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే మధ్యాహ్నం నిద్ర అవసరం. ఆ పైన వయసు దాటిన వారు పడుకున్నా సరే కానీ ఒక అరగంటలో వారిని నిద్రలేపాలి అంటున్నారు నిపుణులు. లేదంటే వారు రాత్రి త్వరగా పడుకోరు.
మనశ్శాంతి
పడుకునే ముందు మీ పిల్లల మనస్సును ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నం చేయండి. వారికి ఇష్టం ఉన్న కథ చదవడం, సంతోషకరమైన మాటలు చెప్పడం వంటివి చేయాలి. లేదంటే మంచి పాటలు వినడం నేర్పించాలి. ఇలా చేస్తే వారి మనస్సును ప్రశాంత పరచవచ్చు. మీ బిడ్డ పడుకున్న తర్వాత అరగంట కంటే ఎక్కువసేపు నిద్రపోవడం కష్టమైతే కచ్చితంగా మీ పిల్లల మనసు ప్రశాంతంగా లేదని మీరు అర్థం చేసుకోవాలి.
సురక్షితమైన వాతావరణం
కొందరు పిల్లలు ఒంటరిగా పడుకోవాలంటే చాలా భయపడుతుంటారు. కొంతమంది పిల్లలు చీకటికి భయపడుతుంటారు. చాలా మంది పిల్లలు భయం వల్ల ఒంటరిగా నిద్రపోవడానికి భయపడుతుంటారు. అందుకే పిల్లలకు రాత్రి భయంకరమైన సినిమాలు చూడనివ్వద్దు.
నిశ్శబ్ద ప్రదేశం
పిల్లలు నిద్రించడానికి నిశ్శబ్ద ప్రదేశం ఉండేలా చేసుకోవాలి. గదిలో శబ్దం లేదా వెలుతురు ఉంటే పిల్లలు నిద్రపోరు. లేదంటే ఇబ్బంది పడతారు. పిల్లలు నిద్రపోవడానికి ఒక గంట ముందు టీవీ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను అసలు ఇవ్వవద్దు.
ఆరోగ్యకరమైన ఆహారం
రాత్రి 8-9 గంటల మధ్య మీ పిల్లలను ఆహారం ఇవ్వాలి. భోజనం ఆలస్యం చేస్తే జీర్ణ సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల పిల్లలు నిద్రపోరు. రాత్రిపూట వారికి కాస్త తక్కువ ఫుడ్ ఇవ్వాలి. రాత్రిపూట కాఫీ ,టీ లను మాత్రం అసలు ఇవ్వవద్దు.