Children Discipline: క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. అయితే ఈ క్రమశిక్షణ చిన్నప్పుడు అలవాటు అయితేనే పెద్దయ్యాక వారి జీవితం ఎంతో బాగుంటుంది. క్రమశిక్షణ లేని వారి జీవితం చిన్నాభిన్నంగా ఉంటుంది. అయితే క్రమశిక్షణ అనేది ఎవరో బయట వారు చెప్పరు. ఇంట్లో వారు లేదా స్కూల్లో నేర్పుతారు. విద్యాసంస్థల్లో ప్రస్తుత రోజుల్లో చదువు వరకే సమయం మించిపోతుంది. అందువల్ల ఇంట్లో ఉండే తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత ఉంది. క్రమశిక్షణ లేకపోతే వారిపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ క్రమశిక్షణ గా ఉంటే వారిని మరిన్ని విషయాల్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది.అసలు పిల్లలు క్రమశిక్షణ గా ఉన్నారా? లేదా? అనేది ముందుగా ఎలా తెలుసుకోవాలి?
చిన్నపిల్లలకు విద్యతోపాటు క్రమశిక్షణ అనేది తప్పనిసరి. ఒక పిల్లవాడు స్కూలు నుంచి ఇంటికి ముందుగా తన షూ విడిచి సాక్సులను భద్రంగా దాచుకుంటాడు. అలాగే తన బ్యాగును జాగ్రత్తగా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచుతాడు. ఇలా చేసేవారు క్రమశిక్షణతో ఉన్నట్లు అనుకోవాలి. అలాకాకుండా ఇంటికి రాగానే చిందర వందరగా షూస్ విడిచి.. బ్యాగును ఇష్టం వచ్చినట్లు పడేస్తే ఆ విద్యార్థికి క్రమశిక్షణ లేనట్లే. ప్రతి విద్యార్థిలో ఐదు రకాల క్రమశిక్షణలు ఉంటే ఆ విద్యార్థి జీవితం భవిష్యత్తులో బాగుంటుంది. వీటిలో కనీసం మూడు అయినా ఉండేవిధంగా చూసుకోవాలి. అంతకంటే తక్కువగా ఉంటే వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఆ ఐదు క్రమశిక్షణలో ఏంటి?
ప్రతి విద్యార్థి ఉదయం లేవగానే తన బెడ్ షీట్ ను తానే మడుచుకునే విధంగా తయారు చేయాలి. ఎందుకంటే ఇది ఒక రకమైన మనశ్శాంతిని ఇవ్వడంతో పాటు చిన్నపాటి వ్యాయామం చేసినట్లు అవుతుంది. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకున్న టవల్ ను ఒక ప్రత్యేక ప్రదేశంలో ఆరేసే విధంగా సూచనలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారిలో జాగ్రత్త పెరుగుతుంది. అలాగే బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత తన ప్లేటును తానే సింక్లో పడేయాలి. ఎందుకంటే వెంటనే తన ప్లేట్ ను సింక్ లో వేయడం వల్ల బాధ్యత తెలుస్తుంది.
స్కూల్ నుంచి ఇంటికి రాగానే విద్యార్థులు తమ షూస్ ను వారే జాగ్రత్తగా విడిచి ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంచాలి. అలాగే స్కూల్ బ్యాగ్స్ ను చిందరవందరగా పడేయకుండా పద్ధతిగా ఉంచుకుని విధంగా తయారు చేయాలి. తమ పుస్తకాలకు జాగ్రత్తగా ఆట్టలను వేసుకునే విధంగా తెలపాలి.
ఈ విధమైన అలవాట్లు వారికి ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తులో వారు మంచి వ్యక్తిగా మారిపోతారు. సమాజంలో ఇలాంటి వారికి గౌరవం కూడా పెరుగుతుంది. కానీ చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా పిల్లలకు చదువుతోపాటు క్రమశిక్షణలో అందించే విధంగా ప్రయత్నం చేయాలి.