https://oktelugu.com/

Money: రోడ్డుపై దొరికిన డబ్బులను తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Money: సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్న సమయంలో మనకు అక్కడక్కడ చిల్లర నాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చిల్లర నాణాలు కనిపిస్తే చాలామంది వాటిని తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు.అలాగే మరికొందరు డబ్బులు దొరికాయన్న ఉద్దేశంతో వాటిని తీసుకుంటారు. ఇలా రోడ్డుపై వెంటవెంటనే చిల్లర కనిపించింది అంటే ముందుగా మనం ఆ ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.ఇలా రోడ్డు పై చిల్లర నాణేలు కనిపిస్తున్నాయి అంటే బహుశాఎవరైనా మరణించి ఉంటే వారి అంతిమయాత్ర చేసేటప్పుడు ఇలా చిల్లర నాణేలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 8, 2021 / 12:50 PM IST
    Follow us on

    Money: సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్న సమయంలో మనకు అక్కడక్కడ చిల్లర నాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చిల్లర నాణాలు కనిపిస్తే చాలామంది వాటిని తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు.అలాగే మరికొందరు డబ్బులు దొరికాయన్న ఉద్దేశంతో వాటిని తీసుకుంటారు.

    ఇలా రోడ్డుపై వెంటవెంటనే చిల్లర కనిపించింది అంటే ముందుగా మనం ఆ ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.ఇలా రోడ్డు పై చిల్లర నాణేలు కనిపిస్తున్నాయి అంటే బహుశాఎవరైనా మరణించి ఉంటే వారి అంతిమయాత్ర చేసేటప్పుడు ఇలా చిల్లర నాణేలు చల్లుతారు. కొన్నిసార్లు అలా చిల్లర నాణేలు కూడా రోడ్డుపై పడి ఉంటాయి.

    Money

    ఇలా రోడ్డుపై చాలా మంది వాటిని చూసి వదిలేసి వెళ్ళిన తరువాత మనకు కనిపించి మనం తీసుకుంటున్నాము అంటే మనం అశుభాన్ని మూటకట్టుకున్నట్లే. అలా కాకుండా ఆ పరిసర ప్రాంతాలలో ఎలాంటి స్మశానం కనిపించకపోతే ఆ డబ్బులను తీసుకొని ఏదైనా ఆలయంలోని హుండీలోకి వేసి ఈ డబ్బులు పోగొట్టుకున్న వారికి మంచి జరగాలని కోరుకోవాలి. మనకు ఇలా రోడ్డుపై దొరికిన డబ్బులను తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.

    Also Read: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్ కి పంపించారా.. వెంటనే ఇలా చేయండి?

    అయితే చాలామంది రోడ్డుపై డబ్బులు దొరికితే లక్ష్మీదేవి తనంతట తాను మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కదా అని భావిస్తారు. అయితే మనకు దొరికిన లక్ష్మీదేవి మనం కష్టపడి సంపాదించినది కాదు అలా డబ్బులు పోగొట్టుకున్నవారు ఎక్కడో ఉండి డబ్బు పోయిందని ఎంతో మనోవేదన చెందుతుంటారు. మనం ఆ డబ్బులు తీసుకుంటే డబ్బుతో పాటు వారి వేదన, బాధ మనకు వస్తుంది. అందుకే దొరికిన డబ్బులు తీసుకోకుండా ఏదైనా ఆలయంలో దేవుని సన్నిధిలో వేసి డబ్బు పోగొట్టుకున్న వారికి మంచి జరగాలని వేడుకోవడం వల్ల ఆ పుణ్యం మనకు దక్కుతుంది. అంతేకానీ రోడ్డు పై పడిన డబ్బులు తీసుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

    Also Read: మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ బీరువా ఇలా ఉండాల్సిందే!

    Tags