Sleeping in a sweater: ప్రస్తుతం చలి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత నమోదు కావడంతో అక్కడివారు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక రక్షణలో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అంటున్నారు. అయితే చలికాలంలో కొందరు చలి నుంచి రక్షించుకునేందుకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్ల వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే చలి నుంచి రక్షించుకునేందుకు చేసే పనుల్లో ఎలాంటి పొరపాట్లు ఉంటాయి అంటే?
సాధారణంగా చలి నుంచి రక్షించుకునేందుకు చలికాలంలో ఎక్కువగా ఉన్ని దుస్తులు ధరిస్తూ ఉంటారు. ఇప్పటికే ఇవి మార్కెట్లోకి రావడంతో చాలామంది కొనుగోలు చేశారు. అయితే ఉన్ని దుస్తుల్లో భాగమైన స్వెటర్లు వేసుకొని తమ పనులను నిర్వహించుకుంటూ ఉంటారు. కొందరు ఇంట్లో ఉండేవారు సైతం స్వెటర్లు ధరిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ స్వెటర్లు ధరించి మరీ నిద్రపోతూ ఉంటారు. వాస్తవానికి చాలా నుంచి రక్షించుకునేందుకు స్వెటర్లు ధరించడం వరకు ఓకే. కానీ స్వెటర్లు ధరించి నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. స్వెటర్లు వేసుకున్నప్పుడు లోపల ఉన్న దుస్తులతో శరీరం బిగుతుగా మారిపోతుంది. దీంతో రక్త ప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే రాత్రి సమయంలో పడుకున్నప్పుడు స్వెటర్లతో అలాగే నిద్రిస్తే రక్తప్రసరణలో ఇబ్బందులు ఉంటాయి. ఫలితంగా ఉదయం లేచే సరికి మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రాత్రి పడుకునేటప్పుడు స్వేటర్లతో ఉండకూడదు. స్వెటర్లను తీసేసి దుప్పటి వంటివి కప్పుకొని నిద్రించాలి.
అలాగే చాలామంది చలికాలంలో రాత్రి నిద్ర పోయేటప్పుడు మరికొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో చేతుల వరకు రక్షణ ఉన్నా.. కాళ్ల వరకు వచ్చేసరికి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోరు. అయితే ఈ సమయంలో సరైన నిద్ర పట్టే అవకాశం ఉండదు. రాత్రి పడుకునేటప్పుడు కాళ్లకు సాక్షులు ధరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోయే అవకాశం ఉంటుంది.
ఇక చలి నుంచి రక్షించుకునేందుకు వేడి నీటిని మాత్రమే తాగాలి. సాధ్యమైనంతవరకు ఉదయమే స్నానం చేయాలి అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం మధ్యాహ్నం స్నానం చేసినా సరిపోతుంది. ముఖ్యంగా వృద్ధుల విషయంలో ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరు బయటకు రాకపోవడమే మంచిది. చర్మ సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లాల్సి వస్తే ప్రత్యేకంగా దుస్తులు ధరించాలి. ఎందుకంటే చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేడిని అందించే పదార్థాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆహారం సైతం ఎప్పటికప్పుడు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.