Ustaad Bhagat Singh Premiere Shows Talk: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షోస్ అయితే స్టార్ట్ అయిపోయాయి… సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అన్న విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: దురంధర్ రివ్యూ : పాకిస్తాన్ పాలిట యమకింకరుడు
కథ
ఒక ఊరిలో కొంతమంది ఆకు రౌడీలను తన దగ్గర ఉంచుకున్న ఒక పొలిటీషియన్ (పార్తీబన్)తనకి ఏదైనా కావాలి అనుకుంటే దానిని సాధించడానికి ఆకు రౌడీలను వాడుతుంటాడు…అతని అరాచకాలు మితి మీరడంతో పోలీస్ ఆఫీసర్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి ఆ పొలిటీషియన్ కి ఎలా బుద్ధి చెప్పాడు. అక్కడి ప్రజలను ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
హరీష్ శంకర్ అంటే మనకు ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమాలు గుర్తుకువస్తాయి… అలాంటి హరీష్ శంకర్ ఈ సినిమాను సైతం పూర్తి కమర్షియల్ హంగులతో నింపేసాడు… పవన్ కళ్యాణ్ ఇంట్రాడక్షన్ నుంచి సినిమా అయిపోయేంత వరకు తనను చాలా హై ఓల్టేజ్ తో చూపించాడు… ఒకప్పటి పవన్ కళ్యాణ్ మళ్ళీ మన కండ్ల ముందు కనిపిస్తాడు… హరీష్ ఏదైతే రాసుకున్నాడో దానిని పెర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు…ముఖ్యంగా ఫస్టాఫ్ అంత ఎంటర్టైనింగ్ గా నడిపించిన హరీష్ సెకండాఫ్ మాత్రం ఎమోషనల్ గా ముందుకు తీసుకెళ్లాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు… కొన్ని యాక్షన్ బ్లాక్స్ లో ఆయన తన పూర్తి ఎనర్జీ ని చూపించాడు…
ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా బాగుంది…బ్యాగ్రౌండ్ స్కోర్ సైతం తమన్ చాలా బాగా అందించాడు. శ్రీలీల పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది…రాశి కన్నా చాలా రోజుల తర్వాత తెరమీద సందడి చేసింది…ఇక ఈ సినిమాలో అక్కడక్కడ చిన్న చిన్న మైనస్ లు ఉన్నప్పటికి సినిమా మాత్రం ఓవరాల్ గా ప్రేక్షకులను మెప్పించింది…
ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్
డైలాగ్స్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్…
సెకండాఫ్ స్టార్టింగ్
