Debt repayment tips: ఈరోజుల్లో కొందరు ఉద్యోగులను నీ జీతం ఎంత? అని అడిగితే రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎంత సంపాదించావు? అని అడిగితే 5 ఈఎంఐలు.. లక్షల రూపాయల అప్పులు అని అంటున్నారు. ఒకవైపు జీతం చూస్తే భారీగా ఉన్నా.. మరోవైపు అంతకుమించిన అప్పులు ఉంటున్నాయి. తక్కువ జీతం వచ్చి అప్పులు అయ్యాయి అంటే అతనికి ఆదాయం సరిపోలేదు అని అనుకోవచ్చు. కానీ భారీ జీతం ఉన్నవారు సైతం అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఉద్యోగులు లేదా వ్యాపారులు చేసే తప్పులు ఏంటి? అప్పుల ఊబీల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
కొంతమంది ఆర్థిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం ప్రస్తుతం ఉన్న చాలామంది యువతకు Money Management గురించి పూర్తిగా తెలియడం లేదని అంటున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు కానీ.. దానిని ప్రణాళిక ప్రకారంగా ఎలా ఎక్స్పెండిచర్ చేయాలి అన్న విషయం తెలుసుకోవడం లేదు. చాలామంది యువత భారీ జీతంతో కలిగిన ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ కొన్ని రోజుల వరకే అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన యువత ముందుగా ఐఫోన్, ఫ్లాట్, కారు వంటి వాటిని కొనుగోలు చేసి ఈఎంఐ లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఈఎంఐ లతో చెక్కులు ఏర్పడి తమ కెరీర్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఫలితంగా అనుకున్నది సాధించలేక.. ఆర్థిక అవసరాలు తీరక.. తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
విలాసం:
ఉద్యోగం లేదా వ్యాపారం చేసే యువత ముందుగా విలాసాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. జీవితాన్ని ఎంజాయ్ చేయొద్దని ఎవరు చెప్పడం లేదు. కానీ వచ్చిన ఆదాయంలో 50 శాతం పెట్టుబడులకు, 25% ఖర్చులకు ఏర్పాటు చేసుకొని.. మిగతా 25 శాతం మాత్రమే విలాసాలకు ఖర్చు పెట్టాలి. అలా కాకుండా చాలామంది 50% వరకు విలాసాలకు ఖర్చుపెట్టి మిగతా వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ ఇవి అత్యవసర పరిస్థితుల్లో సరిపోవడం లేదు. ఫలితంగా కొత్తగా అప్పులు చేసి చిక్కుల్లో చిక్కుకుంటున్నారు.
భవిష్యత్తు:
చాలామంది యువత ప్రస్తుతం వచ్చే ఆదాయంతో ఎలా ఖర్చు చేయాలి? ఎలా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి? అన్న విషయం మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ భవిష్యత్తులో డబ్బు అవసరం ఏ విధంగా ఉంటుంది? అన్నదానిపై దృష్టి పెట్టడం లేదు. దీంతో వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టేసి భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం లేదు. ఇలా వేయని వారు 40 సంవత్సరాల తర్వాత ఆదాయం తగ్గిపోయి మరింత ఆవేదన చెందుతున్నారు. అలాకాకుండా భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ఆదాయాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి.
ఫ్యాషన్ మనీ:
సాధారణంగా మనం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తే వచ్చే డబ్బును యాక్టివ్ మనీ అని అంటారు. కానీ మనం నిద్రపోయిన సమయంలో కూడా డబ్బు రెట్టింపు కావాల్సిన అవసరం ఉంది. అలా వచ్చే డబ్బుని ఫ్యాషన్ మనీ అని అంటారు. ఈ ఫ్యాషన్ మనీ రావాలంటే రకరకాల పెట్టుబడులు పెట్టాలి. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు సైతం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఎక్కువ ఆదాయం వచ్చే వాటిలో పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఇవి మనం పని చేయకపోయినా ఆదాయాన్ని తీసుకువస్తాయి.
ఇవే కాకుండా వచ్చిన ఆదాయంలో సగం వరకు డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేసి.. మిగతా ఉన్న ఆదాయంలో ఖర్చులను తక్కువగా చేస్తూ పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల జోలికి పోకుండా చేతిలో ఉన్న డబ్బుతోనే అవసరాలు తీర్చుకోవాలి. అలా చేస్తే కచ్చితంగా అప్పుల ఊబి ల నుంచి బయటపడతారు.