https://oktelugu.com/

Plants at Home: ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? వీటిని తప్పకుండా ఉంచండి..

చెట్లు మానవ ప్రగతికి మెట్లు అని కొందరు పెద్దలు చెప్పారు. ఒక చెట్టు వల్ల ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది.

Written By: , Updated On : March 21, 2025 / 04:11 PM IST
Plants-for-Home_

Plants-for-Home_

Follow us on

Plants at Home: చెట్లు మానవ ప్రగతికి మెట్లు అని కొందరు పెద్దలు చెప్పారు. ఒక చెట్టు వల్ల ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని రకాల చెట్లు నీడని ఇస్తే.. మరికొన్ని రకాలు చెట్లు ఫలాలను, ఆరోగ్యకరమైన ఔషధాలను అందిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో పట్టణీకరణ కారణంగా చెట్లు మాయమవుతున్నాయి. అడవుల స్థానాల్లో భవనాలు వెలుస్తున్నాయి. కానీ చెట్లపై చాలామందికి మక్కువ తగ్గడం లేదు. దీంతో ఇంట్లోనే చెట్లను పెంచుకుంటున్నారు. అయితే టెర్రస్ లో లేదా ఇంట్లో తప్పకుండా కొన్ని చెట్లను పెంచుకోవాలి. ఇవి ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతంగా ఉండడంతో పాటు స్వచ్ఛమైన గాలి వస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇలా ఇంట్లో చెట్లు ఉండాలని అనుకునే వారు తప్పకుండా ఉండాల్సిన చెట్లు ఏవంటే?

ఇండోర్ ప్లాంట్ లో వెదురు మొక్క తప్పనిసరిగా ఉండాలని అంటున్నారు. దీనిని అలంకరణ కోసం కూడా పెంచుకుంటారు. Feng shuie ప్రకారం వెదురు మొక్క ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం వస్తుందని పేర్కొన్నారు. దీనిని సులభంగా పెంచుకోవచ్చు. ఒక కుండీలో దీనిని వేయడం వల్ల ఇది పెరుగుతూ ఉంటుంది. అయితే మూడు నాలుగు రోజులకు ఒకసారి దీనిలోని నీటిని మార్చుతూ ఉండాలి. ఇంట్లో అణువైన ప్రదేశంతో పాటు బెడ్రూంలో కూడా అలంకరించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు.

ఇంట్లో పెంచుకునే మొక్కల్లో పీస్ లిల్లీ ఒకటి. దీనిని ఎక్కువగా కేర్ తీసుకుపోయిన పెరుగుతుంది. ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి మీ మొక్క చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక గదిలో ఉన్న చెడు వాతావరణం ఇది పీల్చుకుంటుంది. దీనిని ప్రధాన ద్వారం వద్ద లేదా బెడ్రూంలో పెంచుకోవచ్చు. ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఆధ్యాత్మికం వాతావరణం నెలకొంటుంది.

గొందటి ఆకులు కలిగిన జాడే మొక్క ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాలని కొందరు వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇది ఇంట్లో ఉండడంవల్ల అదృష్టంతో పాటు శ్రేయస్సును పెంచుతుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఇది కూడా కార్యాలయాల్లోని బెస్ట్ పై కూడా ఉంచుకోవచ్చు. ఎక్కువ సంపదను ఆకర్షించడంలో జాడే మొక్క ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి అభివృద్ధికి ఈ మొక్క కూడా ఉపయోగపడనుంది.

మనీ ప్లాంట్ మొక్క కూడా ఇంట్లో ఉంచుకోవాలని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ఇది ఇంట్లో ఉండడం వల్ల సంపాదన సృష్టించిన వారవుతారు. ఇది శుక్ర గ్రహానికి అనుగుణంగా ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణ ఉంటుంది. ఇది ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. కానీ లేనివారు కచ్చితంగా పెంచుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు. దేవతకు ప్రతిరూపంగా తులసి మొక్కను పేర్కొంటారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి విష్ణువు కొలువై ఉంటారని పేర్కొంటారు. తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం పెరుగుతుందని పేర్కొంటున్నారు.

తమలపాకు మొక్కలు ఇంట్లో ఆరోగ్యాన్ని శాంతిని తీసుకొస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల ఈ చెట్టు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల కాలుష్యాన్ని తొలగించే స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తాయి. అందువల్ల ఇంట్లో మొక్కలు పెంచాలని అనుకునేవారు తమలపాకు మొక్కలు పెంచుకోవాలి.