https://oktelugu.com/

Driving At Night: రాత్రిపూట వాహనం నడుపుతున్నారా? వీటిని పాటిస్తే ప్రమాదాలకు దూరం..

వాహనాలపై ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టూ వీలర్ అయినా 4 వీలర్ అయినా వాటికి సంబంధించిన నిబంధనలు పాటించాలి. టూ వీలర్ పై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 21, 2024 / 11:08 AM IST

    Night driving

    Follow us on

    Driving At Night: వాహనాలపై ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టూ వీలర్ అయినా 4 వీలర్ అయినా వాటికి సంబంధించిన నిబంధనలు పాటించాలి. టూ వీలర్ పై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. 4 వీలర్ లో ప్రయాణం చేసేవారు సీట్ బెల్ట్ తప్పనిసరి. చాలా ప్రాంతాల్లో రోడ్లు బాగా ఉండడంతో వాహనాలపై వేగంగా వెళ్లాలని అనుకుంటారు. దీంతో అపరిమత స్పీడ్ తో గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు. కొందరికి రాత్రిపూట డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. మరికొందరు ఇదే సమయంలోనే ప్రయాణాలు చేస్తుంటారు. రాత్రిపూట ప్రయాణం చేసే వాహనాలే అధికంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటంటే కొందరు డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోకపోవడమే. అయితే ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే డ్రైవర్లు కొన్ని టిప్స్ పాటించాలి.దీంతో ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటంటే?

    ఒక్కోసారి అత్యవసర సమయాల్లో రాత్రి సమయంలో ప్రయాణం చేయాల్సి రావొచ్చు. లేదా గమ్యానికి చేరుకోవడానికి రాత్రిల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో వాహనాలు నడిపే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీటిలో ప్రధానమైనది వాహనానికి సరైన లైట్స్ ఉన్నాయా? లేవా? అనేది చూసుకోవాలి. 4 వీలర్ లో జాతీయ రహదారిపై ప్రయాణం చేసేవారు తమ వాహనానికి సంబంధించిన హెడల్ లైట్స్ ను హై బీమ్ లో ఉంచండి. ఇలా చేయడం ద్వారా లాంగ్ డిస్టెన్స్ రోడ్ చక్కగా కనిపిస్తుంది. అదే నగరాల్లో, వన్ వే పై ప్రయాణం చేసే సమయంలో వీటిని తక్కువ బీమ్ లో ఉంచాలి. సిటీల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందున్న వాహనాలు, మనుషులు కనిపిస్తారు.

    సాధారణంగా రెగ్యులర్ గా ఒకే దారిపై ప్రయాణం చేయడం వల్ల ఆ రోడ్డు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే ఒక్కోసారి తెలియని ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డు ఎలా ఉంటుందో తెలియందు. ముఖ్యంగా రోడ్డుపై గుంతలు, గతుకులు ఎలా ఉన్నాయో తెలియదు. దీంతో తెలియని ప్రదేశానికి వెళ్లే సమయంలో వేగాన్ని తగ్గించడమే మంచిది. అంతేకాకుండా ఇలాంటి ప్రదేశాల్లో ప్రయాణం చేసేవారు రహదారిపై మాత్రమే శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు తోటి వారితో మాట్లాడడం మానుకోవాలి.

    కొందరు డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ మాట్లాడడం లేదా తమ వాహనంలో ఇతరులు ఉంటే వారితో సంభాషణలు చేస్తూ ఉంటారు. రాత్రిళ్లు ప్రయాణం చేసేవారు ఇలాంటివి మానుకోవాలి. గమ్యం చేరే వరకు కామ్ గా డ్రైవింగ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే మాటల్లో పడి డ్రైవింగ్ చేయడం వల్ల ఒక్కోసార టర్నింగ్, డివైడర్ చూసుకోలేరు. దీంతో ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది.

    రాత్రిళ్లు ప్రయాణం ఉంటుందని ముందే తెలిసినప్పుడు కారు పనితీరుపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కారుకు బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి తెలియని ప్రదేశానికి వెల్లినప్పుడు సడెన్లీ బ్రేక్ వేయాల్సి వస్తుంది. దీంతో ఆ సమయంలో బ్రేక్ పడకపోవడంతో ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా కారుకు ఏదైనా సమస్య వచ్చి మధ్యలోనే ఆగిపోతే కష్టం అవుతుంది. అందువల్ల ముందే కారు పనితీరు గురించి తెలుసుకున్న తరువాతే ప్రయాణం ప్రారంభించాలి.