Mangoes : వేసవికాలం రాగానే మార్కెట్లో మామిడి పండ్లు సందడి చేస్తుంటాయి. పండ్లలో రారాజు గా పిలిచే మామిడి పండ్లు తినడం వల్ల ఎంతో అనుభూతి కలుగుతుంది. రుచికరమైన పనులు తినడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. అలాగే మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి మామిడి పండ్లలో విటమిన్ ఏ, సి, ఈ, బీ6, కే వంటివి ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మామిడిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం, రాగి వంటి కనిజాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో అంతా కల్తీ మయంగా మారిపోతుంది. ఈ క్రమంలో మామిడి పండ్లు కూడా నకిలీవి మార్కెట్లోకి దర్శనం ఇస్తూ ఉంటాయి.మరి కల్తీ మామిడి పండ్లను గుర్తించడం ఎలా?
Also Read : అమెరికా నుంచి ఆఫ్రికా దాకా.. మామిడి పండ్లంటే ఓ ఎమోషన్.. వీడియో వైరల్
మార్కెట్లోకి వెళ్లగానే పసుపు రంగులో ఉన్న మామిడి పండ్లను చూడగానే నోరూరుతుంది. దీంతో వెంటనే ధరను కూడా చూడకుండా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొందరు రసాయనాలు కలిపినా మామిడి పండ్లను విక్రయిస్తూ ఉంటారు. ఇవి తినడం వల్ల అనేక రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. రసాయనాలు కలిగిన మామిడి పండ్లు తినడం వల్ల శ్వాస కోసం సమస్యలు ఏర్పడతాయి. అలాగే జీనక్రియ సమస్యలు ఉంటాయి. అందువల్ల మామిడి పండ్లు కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
మామిడి పండ్లు త్వరగా పండడానికి ఇందులో కాల్షియం కార్బైడ్ కలుపుతారు. అలాగే ఇతలిన్ కూడా కూడా కలుపుతూ ఉంటారు. అయితే ఇవి కలిపినప్పుడు కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. వీటిలో మొదటిది సువాసన. సాధారణ మామిడి పండ్లు సువాసనను ఎక్కువగా కలిగి ఉంటాయి. కానీ కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు సువాసనను ఎక్కువగా అందించవు. అందువల్ల మామిడి పండ్లు కొనే సమయంలో సువాసన ఎక్కువగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. సువాసన తక్కువగా ఉంటే ఆ పండ్లను కొనుగోలు చేయడానికి ఆలోచించాలి.
సాధారణమైన మామిడిపండు పూర్తిగా పండుతుంది. కానీ కృత్తిమంగా పండించిన మామిడి పండు ఒకవైపు మాత్రమే పండి మరోవైపు గట్టిగా ఉంటుంది. అందువల్ల మామిడి పండ్లు కొనుగోలు చేసేటప్పుడు అది పూర్తిగా పండిందా లేదా అనేది చూసుకోవాలి. సగం వరకు మాత్రమే పండి ఉంటే దానిని కొనుగోలు చేయడానికి ఆలోచించాలి. ఇందులో రసాయనాలు కలిశాయని గుర్తు పెట్టుకోవాలి.
రసాయనాలు కలిపిన మామిడి పండ్లు ఎక్కువగా పండుతుంది. అంటే మరీ గుజ్జులా తయారవుతుంది. సాధారణ మామిడిపండు ఇలా కాదు. అందువల్ల బాగా పండిన మామిడిపండును తీసుకోవడానికి ఆలోచించాలి. ఇలాంటి పండును తినడం వల్ల అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : జపాన్ లో జత మామిడి పండ్లు 5000 డాలర్లు.. బంగ్లాదేశ్ లో 2000 టాకాలే.. అసలేంటి ప్రత్యేకతంటే?
కృత్రిమంగా పండించిన పండు ముడతలు పడి ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్ల చర్మం వింతగా కనిపిస్తోంది. కానీ సాధారణ మామిడిపండు అలా ఉండదు. అందువల్ల బాగా ముడతలు కనిపించే మామిడి పండ్ల జోలికి వెళ్లకుండా ఉండండి. సాధారణ మామిడిపండు గ్రీన్ కలర్ తో కూడిన పసుపు కలర్ ఉంటుంది. కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు పూర్తిగా ఎల్లో కలర్ లో ఉంటాయి. అందువల్ల ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంచుకొని మామిడి పండ్లను కొనుగోలు చేయాలి.