Friends: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లు వచ్చాక పక్కన ఉండే స్నేహితుల కంటే ఆన్ లైన్ దోస్తానా ఎక్కువగా ఉంటుంది. కుదిరినంత ఎక్కువ సమయం చాటింగ్ లు, ఫోన్స్, వీడియో కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు. ఇక పక్కన ఉండే దోస్తులు, మామ బిర్యానీ తిందామా? షాపింగ్ కు వెళ్దామా? సినిమా చూద్దామా? అంటూ తిరుగుతుంటారు. స్కూల్, కాలేజీలు బంక్ కొడుతూ తిరగడం వంటివి చేస్తారు. అయితే సరదాగా కలిసి ఉండటం వరకు బాగున్నా ఆపద వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు అనేది ముఖ్యం.
స్నేహితులు ఎప్పుడు కూడా మరో స్నేహితుడి మంచిని కోరుకోవాలి. ఎవరితో అయినా స్నేహం చేస్తే కేవలం సరదాకి, టైమ్ పాస్ కి మాత్రమే స్నేహం చేయకూడదు. కష్ట సుఖాల్లో కూడా తోడు ఉండాలి. ఏ రిలేషన్ అయినా సరే కష్టంలో, ఆపదలో ఆదుకున్నప్పుడు మాత్రమే ఆ రిలేషన్ కు గౌరవం ఉంటుంది. కేవలం తాగడం, తిరగడం వంటి వాటిలో కలిసి ఉన్నంత మాత్రానా ఆ బంధం స్ట్రాంగ్ అని అనుకోలేము.
ఆపద వచ్చి ఫోన్ చేసినప్పుడు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు అంటే ఆ వ్యక్తిని దూరం పెట్టడం బెటర్. కేవలం డబ్బు సాయం చేసేవాడు మాత్రమే కాదు ఫ్రెండ్. బాధ పడుతున్నప్పుడు పక్కన ఉండి లేదంటే ఫోన్ లో అయినా సరే మిమ్మల్ని ఓదారుస్తూ మోటివేట్ చేయడానికి, మీ మూడ్ ను ఛేంజ్ చేయడానికి ప్రయత్నించే వారే మీ నిజమైన ఫ్రెండ్. మీరు బాధ పడుతున్నారు. ఇబ్బందిలో ఉన్నారు అని తెలిసినా కూడా మీ ఫోన్ ఎత్తకుండా, మిమ్మల్ని అవైడ్ చేస్తూ సాకులు చెబుతున్నారు అంటే వారికి దూరం ఉండాల్సిందే.