Film shooting in Trains: ఇండియన్ మూవీస్ కు రైల్వే సన్నివేశాలకు విడదీయరాని సంబంధాలు ఉంటాయి. చాలా సినిమాల్లో ట్రైన్ సన్నివేశాలు ఉంటాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినిమాల్లో రైలు సన్నివేశాలు చూస్తూనే ఉంటాము. కొన్ని సినిమాలు రైల్వే స్టేషన్ లో, కొన్ని రైలు కంపార్ట్మెంట్ లలో చిత్రీకరిస్తుంటారు. కొన్ని సినిమాలు అయితే రైల్లోనే సగం అవుతుంటాయి.రైల్వే స్టేషన్ లో గానీ, రైల్లో గానీ కొన్ని మరి ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్వే శాఖకు సినిమాల ద్వారా బాగానే రాబడి వస్తుందట. మునుపటి రోజుల్లో రైలులో సినిమాల సన్నివేశాలు చిత్రీకరించాలి అంటే ఓ పెద్ద లంబా చౌడా కహానీ ఉండది. రైల్వే శాఖ నుంచి అనుమతి పొందాలి అంటే కూడా నెలల సమయం పట్టేది. 2021 వరకు ఒరిజినల్ రైల్వే స్టేషన్ లో, ట్రైన్ సన్నివేశాలు చిత్రీకరించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉండేది. దీని కోసం ఏకంగా జోనల్ అండ్ బోర్డ్స్ దగ్గర అప్లికేషన్ చేసిన తర్వాత అనుమతి కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం దీని కోసం అంతలా కష్టపడాల్సిన అవసరం లేదు.
FFO.Govt.In అనే వెబ్ సైట్ వల్ల ప్రస్తుతం ఈ ప్రాసెస్ సులభం అయింది. ట్రైన్ లో ఒక సినిమా షూటింగ్ చేయాలంటే లక్ష వరకు ఛార్జ్ అవుతుంది. అయితే ఈ ఖర్చు కేవలం 2008 వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ధర మరింత పెరిగింది. ఒక నాలుగు కోచ్ లు ఉన్న స్పెషల్ ట్రైన్, ఒక ఎస్ఎల్ ఆర్ ఉన్న ట్రైన్ సన్నివేశాలు చిత్రీకరించాలి అంటే ఒక రోజుకు 4.74 లక్షల ఖర్చు వస్తుంది. ఇది 2015 లెక్క ప్రకారం గమనిస్తే..ఇలా చెల్లించినందుకు దాదాపు రెండు వందల కి. మీ ప్రయాణం చేయవచ్చట.
జస్ట్ రెండు బోగీలు మాత్రమే ఉండి ఈ సన్నివేశాలు చిత్రీకరించాలి అంటే ఒక కి. మీకు రూ. 1044 అవుతుందట. కొన్ని సార్లు దీనికి అదనపు ఛార్జీలు కూడా అవుతాయట. ఇక సినిమా షూటింగ్ లతో 2021లో సెంట్రల్ రైల్వే కు రూ. 2 కోట్ల 48 లక్షల మేర ఆదాయం వచ్చిందట.