Monkeys Causing Trouble: ప్రకృతి ప్రసాదించిన చెట్లు నరికివేత కారణంగా జంతువులకు నివాసం కష్టతరమవుతోంది. ఈ క్రమంలో చాలా జంతువులు ఆహారం కోసం జనవాసాల్లోకి వస్తున్నాయి. కోతుల నుంచి చిరుత పులి వరకు ప్రజల్లోకి వచ్చి వారిపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఇళ్లపై, పంట పొలాల్లో కోతులు చేసే విధ్వంసం మామూలుగా లేదు. ఇంటిపై ఉన్న పెంకులను ధ్వంసం చేస్తూ భారీగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఒక్కోసారి ఇవి మనుషులపై దాడి చేస్తున్నాయి. అలాగే పంట పొలాల్లో పంటలను నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో కోతులపై చర్యలు తీసుకోవాలని చాలా మంది బాధుతులు ప్రభుత్వాలను కోరుతున్నాయి. కానీ వీటి కోసం ప్రత్యేకంగా పార్క్ ఏర్పాటు చేసి వాటిని తరలిస్తామని ప్రకటిస్తున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అయితే కొన్ని చర్యల వల్ల కోతుల బెడద నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. అవేంటంటే?
కోతుల సమస్యల పరిష్కారానికి కొందరు కొన్ని టిప్స్ చెబుతున్నారు. కోతులు దాడి చేసినా.. వాటిపై తిరిగి దాడి చేస్తే జంతు సంరక్షణ చట్టం ప్రకారం కేసులు అవుతుంటాయి. దీంతో వాటిపై దాడి చేయకుండా.. వాటి బెడద నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. వీటిలో రంగు నీళ్ల బాటిల్ ఒకటి. ఒక బాటిల్ నిండా నీళ్లు నింపి అందులో ఫుడ్ కలర్ లేదా.. ఇతర రంగును కలపండి. ఇలా బాటిల్ మొత్తం కలర్ గా మారిపోతుంది. దీనిని సూర్య కిరణాలు పరావర్తనం చెందే చోట ఉంచడం వల్ల వీటిని చూడడం వల్ల కోతులు భయపడిపోయి అటువైపు రాకుండా ఉంటాయి.
ఇళ్లలో కోతులు విధ్వంసం సృష్టిస్తే.. ఈ ట్రిక్ ఫాలో కావాలి. ఇంట్లో అల్లం, వెల్లుల్లితో ఒకరకమైన ముద్దలాగా తయారు చేయాలి. ఇది బాగా వాసన వెదజల్లేలా తయారు చేసుకోవాలి. ఇది ఎక్కువగా కోతులు వచ్చే ప్రాంతాల్లో ఉంచడం వల్ల ఆ వాసనకు కోతులు రాకుండా ఉంటాయి. కోతులు ఎంత చిందర వందర చేసినా..కొన్ని శబ్దాలకు బాగా భయపడిపోతుంటాయి. ముఖ్యంగా క్రాకర్స్ వంటి పేలిస్తే అటువైపు రాకుండా ఉంటాయి. అలాగే ఏదైనా శబ్దం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటే అవి రాకుండా ఉంటాయి.
సాధారణంగా రాత్రిపూట కోతులు ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. కానీ అలా కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటూ లేజర్ లైట్ ఉపయోగించాలి. వీటిని చూపించడం వల్ల కోతులు భయానికి పారిపోతాయి. అయితే పగటిపూట మాత్రం ఇది పనిచేయదు. కొన్ని రకాల పొగలంటే కోతులకు నచ్చవు. అయితే పంట పొలాల్లో కోతులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అనుకుంటే చిన్న మంటలాగా ఏర్పాటు చేసుకొని వాటిపై పచ్చి ఆకుల కొమ్మలను వేయండి. ఇవి పెద్దగా పొగను విరజిమ్ముతాయి. దీంతో కోతులు అటువైపు రాకుండా ఉంటాయి.
కోతులు ఎక్కువగా కొండెంగలకు బాగా భయపడిపోతుంటాయి. దీంతో కొండెంగకలకు సంబంధించిన ఆకారాలను తయారు చేసి టెడ్డీ బేర్ బొమ్మలాగా కోతులు వచ్చే ప్రదేశంలో ఉంచండి. లేదా కొండెంగ బొమ్మలతో ఉన్న ఫొటోలను కోతులు వచ్చే ప్రదేశంలో ఉంచాలి. వీటిని చూసిన కోతులు అటువైపు రాకుండా ఉండే అవకాశం ఉంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Are the monkeys causing trouble do this and dont look that way
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com