Aadhaar: ప్రస్తుతం ఆధార్ కార్డు అన్నింటికి ఆధారంగా మారింది. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, రుణం తీసుకోవాలన్నా ఆధార్ కార్డునే చూపించాలి. ఆధార్ లో పన్నెండంకెలు ఉంటాయి. ఇటీవల కాలంలో మన కార్డును మనకు తెలియకుండానే ఇతరులు వాడే ప్రమాదం ఉంది. దీన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండకపోతే మనకు నష్టమే. దీంతో ఆధార్ కార్డు వినియోగం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని చూసుకోవాలి. ఒక వేళ దుర్వినియోగం అయితే తక్షణమే ఫిర్యాదు చేయాలి. లేకపోతే మనకే నష్టం కలుగుతుంది.

భారతదేశంలో చాలా మందికి ఆధార్ కార్డులున్నాయి. లేని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. పుట్టిన బిడ్డలకు కూడా ఆధార్ నమోదు చేస్తున్నారు. దీంతో మన ఆధార్ కార్డు గురించి ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆధార్ కార్డు మన పేరు మీద రిజిస్టర్ చేసుకోవడంతో అన్నింట్లో దీని వాడకం పెరిగిపోయింది. మన ఆధార్ దుర్వినియోగం అయిందో కాలేదో అనే విషయాలు తెలుసుకోవడానికి టాఫ్ కాప్ పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించింది. దీంతో మన పేరుతో రిజిస్టరైన మొబైల్ కనెక్షన్లను తేలికగా గుర్తించవచ్చు. ఈ అవకాశం తెలంగాణ, కేరళ, రాజస్తాన్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.
ఇలా ఆధార్ కార్డు చెక్ చేసుకోవాలంటే ముందు http//tafcop.dgtelecom.gov.in/ లోకి వెళ్లాలి. తరవాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ ఆప్షన్ మీద నొక్కాలి. ఫోన్ కు వచ్చిన ఓటీపీ నంబర్ ను ఎంటర్ చేసి వాలిడేట్ పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ సంఖ్య మీద జారీ అయిన మొబైల్ నంబర్లు, సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. వీటిలో మనకు సంబంధించని నంబర్లు ఉంటే ఫిర్యాదు చేయాలి. దిస్ ఈజ్ నాట్ మ నంబర్, నాట్ రిక్వయిర్డ్, రిక్వయిర్డ్ ఆప్షన్లలో అవసరమైనది ఎంచుకుని రిపోర్టు చేయాలి. అప్పుడు మన రిపోర్టును నమోదు చేసుకున్నట్లు సందేశం వస్తుంది.

ఇలా మన ఆధార్ కార్డును ఇతరులు వాడితే మనకు ఇబ్బందులు తలెత్తుతాయి. వారు ఏదైనా నేరం చేసినా మన సంఖ్య వల్ల మనకు మెడకు చుట్టుకుంటుంది. దీంతో ఆధార్ నంబర్ ను దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దీనికి గాను అందరు తమ ఆధార్ ను సరి చూసుకుంటూ ఇతరులు వాడకుండా అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఎవరైనా మన నంబర్ ను వాడితే కలిగే అనర్థాల వల్ల కలిగే ఇబ్బందులను గుర్తుంచుకుని మన నంబర్ ను ఎవరికి ఇవ్వకూడదు.