Krishna- Chiranjeevi: టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అనే పదానికి పర్యాయపదం లాంటి వాడు సూపర్ స్టార్ కృష్ణ..అప్పట్లో తొలి సౌత్ స్కోప్ సినిమా, తొలి కౌ బాయ్ సినిమా, తొలి 70 ఏం ఏం సినిమా..ఇలా ఒక్కటా రెండా సాంకేతికంగా టాలీవుడ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన సూపర్ స్టార్ కృష్ణ మల్టీస్టార్ర్ర్ సినిమాలు తియ్యడం లో కూడా ఒక కొత్త ఒరవడిని సృష్టించారు..ఈయన చేసినన్ని మల్టీస్టార్ర్ర్ సినిమాలు ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా చేసుండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తన ముందు తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ వంటి వారితో పాటు..తనతో సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్న శోభన్ బాబు మరియు కృష్ణం రాజు వంటి వారితో కూడా ఎన్నో సినిమాలు చేసాడు..ఇక అప్పుడప్పుడే యువ హీరో ఇండస్ట్రీ లో దూసుకొస్తున్న చిరంజీవి గారితో కూడా కృష్ణ గారు కొత్తపేట రౌడీ, కొత్త అల్లుడు మరియు తోడు దొంగలు వంటి సినిమాలు చేసాడు.
ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘానా విజయం సాధించాయి..వీటిల్లో కొత్త అల్లుడు సినిమాలో చిరంజీవి నెగటివ్ రోల్ చెయ్యగా..కొత్తపేట రౌడీ సినిమాలో చిరంజీవి ముఖ్య పాత్ర పోషించాడు..ఇక 1981 వ సంవత్సరం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పర్ఫెక్ట్ కమర్షియల్ మల్టీస్టార్ర్ర్ మూవీ ‘తోడు దొంగలు’..అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది..చిరంజీవి గారికి కూడా ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది..భారీ అంచనాలతో అప్పట్లో విడుదలైన ఈ సినిమా సుమారుగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

కృష్ణ మరియు చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు మరియు సాంగ్స్ చూస్తే ఇరువురి హీరోల అభిమానులకు కనులపండుగలగా ఉంటుంది..ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాలు రాలేదు కానీ ఇరువురి హీరోల అభిమానులు మాత్రం చిరకాలం గుర్తించుకునే చిత్రం గా తోడు దొంగలు నిలిచిపోయింది.