Alluri Seetarama Raju Collections: సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లో మాత్రమే కాదు..తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మైల్ స్టోన్ లాంటి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’..అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి మాటల్లో చెప్పలేనిది..దేశభక్తి కి నిలువెత్తు నిదర్శనం లాగ ఉండే ఈ సినిమాని చూస్తే గర్వం తో వందేమాతరం అని బిగ్గరగా ప్రతి తెలుగోడు అరిచే విధంగా ఉంటుంది ఈ చిత్రం..అప్పటి వరుకు ఊర మాస్ హీరో ఇమేజి ఉన్న కృష్ణ గారు కమర్షియల్ ఎలెమెంట్స్ ఏ మాత్రం లేని ఇలాంటి సినిమా చెయ్యడం ఒక ఎత్తు అయితే..ఈ చిత్రం లో ఆయన కనబర్చిన నటన మరో ఎత్తు..ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో కృష్ణ గారి నటనకి కంటతడి పెట్టని మనిషి ఉన్నాడు అంటే అతను మనిషే కాదు అన్నట్టు లెక్క..ఆ స్థాయిలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు కృష్ణ..ఈ కథతో సినిమా చెయ్యాలనేది అప్పట్లో ఎన్టీఆర్ గారి కోరిక..స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని అప్పట్లో ఎన్టీఆర్ ఫోటో షూట్ కూడా చేసాడు.

కానీ బడ్జెట్ కారణంగా ఈ స్క్రిప్ట్ ని పక్కన పెట్టారు ఎన్టీఆర్..ఆ తర్వాత నిర్మాత కె ఎస్ ప్రకాష్ రావు గారు అక్కినేని నాగేశ్వర రావు గారితో ఈ సినిమా చేద్దాం అనుకున్నాడు..కానీ ఆయన కూడా ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించలేదు..తర్వాత టీఎల్ రావు గారు శోభన్ బాబు తో చేద్దాం అనుకున్నారు..శోభన్ బాబు గారికి ఈ సినిమా చెయ్యాలని ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ తన మార్కెట్ కి మించిపోవడం ఆయన కూడా సాహసం చెయ్యలేదు..అలాంటి సమయం లో కృష్ణ గారు తన వందవ సినిమాగా ఈ చిత్రం చేద్దామని ఫిక్స్ అయిపోయారు..దేవదాసు వంటి అద్భుతమైన చిత్తాన్ని నిర్మించిన డీఎల్ గారు ని కృష్ణ గారు ఒకరోజు కలిసి తన వందవ చిత్రం గా అల్లూరి సీతారామరాజు కథ తో చేద్దామని అడిగారు..అంత బడ్జెట్ తో నేను సినిమా తియ్యలేను అని చెప్పి, కావాలంటే ఆ స్క్రిప్ట్ నేను ఇస్తాను మీరే చేసుకోండి అని కృష్ణ గారికి స్క్రిప్ట్ ని ఇచ్చారు.

కృష్ణ గారు ప్రముఖ రచయితా త్రిపురనేని మహారథి గారిని సహాయం తీసుకొని స్క్రిప్ట్ ని మరింత మెరుగుపరిచి రామ చంద్రరావు గారి దర్శకత్వం లో తన సొంత బ్యానర్ పై పాతిక లక్షల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రారంభించారు..కానీ దురదృష్టం ఏమిటి అంటే ఈ సినిమా 70 శాతం పూర్త చేసుకున్న తర్వాత రామ చంద్ర రావు గారు మరణించారు..ఇక ఆ తర్వాత సినిమా మిగిలిన భాగానికి కృష్ణ గారే దర్శకత్వం వహించారు..అలా తొలి సౌత్ స్కోప్ చిత్రం గా 1974 వ సంవత్సరం మే 1 వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది..ఈ సినిమా విషయం లో కృష్ణ గారితో గొడవ పెట్టుకున్న ఎన్టీఆర్ సినిమా విడువులైన తర్వాత అది సృష్టించిన ప్రభంజనం చూసి శుభాకాంక్షలు తెలియచేసాడు..అప్పట్లో మొదటి వారం 18 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం..38 కేంద్రాలలో 50 రోజులు, 19 కేంద్రాలలో 100 రోజులు మరియు హైదరాబాద్ లోని సంగం థియేటర్ లో సంవత్సరం రోజులు ప్రదర్శితమైంది..ఫుల్ రన్ లో సుమారు గా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఆరోజుల్లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్షన్స్ అంటే మూడు బాహుబలి సినిమాల కలెక్షన్స్ తో సమానం అన్నమాట..అలా ఈ చిత్రం రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి కృష్ణ గారి వందవ చిత్రం గా చరిత్రలో మర్చిపోలేని విజయం గా నిలిచింది.