AP Jobs: ఏపీ వైద్య విధాన పరిషత్ కు సంబంధించిన విజయనగరం జిల్లాలోని డీసీహెచ్‌ఎస్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫీకేషన్ రిలీజైంది. పది, డిప్లొమా అర్హతతో ఈ సంస్థ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీలలో ఫార్మసిస్టుల ఉద్యోగ ఖాళీలు 2, థియేటర్ అసిస్టెంట్ 1, రేడియోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 3, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 1, ఆడియోమెట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. పదో తరగతితో పాటు డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ/ఎమ్‌ఫార్మసీ, డిగ్రీలో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
Also Read: ప్రత్యేక హోదా’ ఆ ఎన్నిక కోసమేనా?
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. రిజర్వేషన్, రాతపరీక్ష, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. విజయనగరం డీసీహెచ్‌ఎస్ కార్యాలయం అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://vizianagaram.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్