YouTube: యూట్యూబ్ చార్జీల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్న వీడియోల్లో యాడ్లు లేకుండా ఉండాలంటే నెలకు రూ.129 చెల్లించాల్సిందే. దీంతో మన జేబులు గుల్ల అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూ ట్యూబ్ మరిన్ని నిబంధనలను తేనుంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రాధాన్యం పెరుగుతోంది. అందరు యూట్యూబ్ కు అలవాటు పడుతున్నారు. ప్రతి వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో వీడియోలు చూస్తున్నారు. యాడ్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రతి నెల డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో వినియోగదారుల జేబులు గుల్ల చేసేందుకు యూట్యూబ్ సిద్ధమైపోతున్నట్లు చెబుతున్నారు.

ఇకపై 4కె వీడియోలు చూడాలన్నా ప్రీమియం చెల్లించాల్సిందే. దీని కోసం యూట్యూబ్ మరో నిబంధన అమల్లోకి తేనుంది. దీంతో వినియోగదారులకు చుక్కలు కనిపించనున్నాయి. ఈ రోజుల్లో యూట్యూబ్ వాడని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ఇక నుంచి 4కె వీడియోలు చూసినా డబ్బులు చెల్లించాలనే షరతు విధించడంతో యూట్యూబ్ వీక్షించడం ఖర్చుతో కూడుకున్నదే అవుతోంది. భవిష్యత్ లో యూట్యూబ్ లో వీడియోలు చూడటం కూడా ఖర్చుతో కూడుకున్నదే అని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లు ప్రస్తుతం సామాజిక రంగంలో దూసుకుపోతున్నాయి. మిగతావి ఎలాంటి రుసుము తీసుకోకున్నా యూ ట్యూబ్ మాత్రం డబ్బులు చెల్లించాలనే రూల్స్ పెట్టడం సంచలనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ వీడియోలు చూసేందుకు కూడా డబ్బులు తీసుకోవడంతో వినియోగదారులకు కష్టాలు ఎదుర్కోవడం తప్పనిసరే. రాబోయే కాలంలో యూ ట్యూబ్ మరింత ప్రియం కానుందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

యూ ట్యూబ్ సబ్ స్క్రైబర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఉచితంగా ప్రసారం చేసిన వీడియోలకు యాడ్స్ లేకుండా ఉండేందుకు కూడా డబ్బు వసూలు చేస్తుండటంతో ఇక మీదట యూట్యూబ్ ప్రసారాల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని సమాచారం. దీనిపై భవిష్యత్ లో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీనిపై యూట్యూబ్ కూడా కసరత్తు చేస్తుంది. వినియోగదారులకు ఎంత మేర వడ్డించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
[…] Also Read: YouTube: యూ ట్యూబ్ చూసే వారికి మరో షాకేనా? […]