Balakrishna Unstoppable With Chandrababu: వాళ్లిద్దరూ బావ-బావమరుదులు.. ఆ నందమూరి తారక రామారావు రాజకీయ వారసులు.. రాజకీయాల్లో అయినా.. సినిమా రంగంలో అయినా కలిసే ఉన్నారు.. కలిసే కాపురం చేశారు. ఎప్పుడూ వాదులాడుకోకుండా బావ చాటు బావమరిదిలా మన ‘బాలయ్య’ బాబు ఒదిగిపోయాడు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ను చంద్రబాబు చేతుల్లో పెట్టేటప్పుడు కూడా బాలయ్య తన బావకే సపోర్టుగా నిలిచాడు. అంతటి అనోన్యం చివరకు వియ్యంకులుగా మారేవరకూ సాగింది.

తన కూతురును చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఇచ్చి వివాహం జరిపించాడు బాలయ్య. అప్పటి నుంచి వీరి బంధుత్వం కొనసా…గుతూనే ఉంది. తాజాగా బాలయ్య సినిమాల్లో హీరోగానే కాదు.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగానూ ద్విపాత్రాభినయం కొనసాగిస్తున్నారు. ఇక ‘ఆహా’లో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో నిర్వహిస్తున్నారు. ఈ షో ఫస్ట్ సీజన్ బాగా హిట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా రెండో సీజన్ మొదలైంది. ఈ రెండో సీజన్ తొలి షోకు ఏకంగా టీడీపీ అధినేత, బాలయ్య బావ చంద్రబాబు హాజరు కావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఆహాలో అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్య ఇరగ్గొట్టాడు. వ్యక్తిగత విషయాలు, మద్యం అలవాట్లు కూడా గెస్ట్ ల నుంచి రాబట్టి అందరినీ ఆకర్షించాడు. ముఖ్యంగా బాలయ్య తన ఆటిట్యూడ్ కు భిన్నంగా నిర్వహించిన ఈ టాక్ షో పెద్ద హిట్ అయ్యింది.
తాజాగా ఈ షోలోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాగానే ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లు, ఈలలు, గోలలతో హోరెత్తించారు. ‘సీఎం సీఎం’ అంటూ చంద్రబాబు నినాదాలు చేస్తూ గోల గోల చేశారు. ఈ వీడియో తాజాగా లీక్ అయ్యి వైరల్ అయ్యింది.

దీన్ని బట్టి బాలయ్య అన్ స్టాపబుల్ రెండో సీజన్ తొలి గెస్ట్ చంద్రబాబు అని తేలింది. మరి బాలయ్య రోమాంటిక్, నాటు ప్రశ్నలకు చంద్రబాబు ఏం సమాధానం ఇచ్చాడు. చంద్రబాబుకు మద్యం తాగే అలవాటు ఉందా? పర్సనల్ విషయాలు ఏమైనా బాలయ్య రాబట్టాడా? లాంటి విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. షో ప్రసారం అయితే కానీ అందులో ఏమున్నవన్నవి తెలియవు. లెట్ వెయిట్ అండ్ సీ..
[…] […]
[…] […]