Hari Hara Veera Mallu Postponed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ ‘హరిహర వీరమల్లు’..పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటిసారి పీరియాడిక్ జానర్ లో ఒక సినిమా చెయ్యడం తో ఈ మూవీ పై ఒక అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..కొంతకాలం తాత్కాలికంగా షూటింగ్ ని ఆపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 17 వ తారీకు నుండి సరికొత్త షెడ్యూల్ ని జరుపుకోబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ షెడ్యూల్ కి సంబంధించిన వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నాయి..సుమారు నెల రోజుల పాటు సాగనున్న ఈ భారీ షెడ్యూల్ తో సినిమా 80 పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు..ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 30 వ తేదీన విడుదల చెయ్యబోతున్నాము అంటూ నిర్మాత AM రత్నం అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ఈ చిత్రాన్ని మార్చి 30 వ తారీఖున కాకుండా మే 11 వ తేదీన విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు..ఎందుకంటే ఈ ఏడాది చివరికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయినా కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ నిమ్మితం కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..ఈ సినిమాకి VFX డైరెక్టర్ గా హాలీవుడ్ లో ఆక్వామ్యాన్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి పని చేసిన బెన్ లాక్ పని చేస్తున్నాడు..ఆయన మాత్రమే కాకుండా ఎంతో మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు.
Also Read: YouTube: యూ ట్యూబ్ చూసే వారికి మరో షాకేనా?

ఔట్పుట్ అద్భుతంగా రావాలంటే కచ్చితంగా సమయం తీసుకోవాల్సిందే..అందుకే ఈ సినిమాని వాయిదా వేస్తె బాగుంటుందని ఆలోచిస్తున్నారట దర్శక నిర్మాతలు..పైగా మే 11 వ తేదీన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలై ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..మళ్ళీ అదే తేదీన సినిమా విడుదల చేస్తే సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారట..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే బయటకి రానుంది.
Also Read:Chandrababu In Unstoppable With NBK: ‘ఆహా’… ఓహో.. బాలయ్య పొలిటికల్ అన్ స్టాపబుల్!