Animals : ఒక మనిషి రూపాన్ని వ్యక్తీకరించేవి కళ్ళే. ఆ కళ్ళతో ఎన్నో భావాలను ప్రదర్శించవచ్చు. నయనం.. వేల కోట్ల దృశ్యాల అద్భుతం అంటారు.. మనుషులే కాదు, జంతువులు కూడా తమ కళ్ళతో మాయ చేస్తాయి.. ఎన్నో భావాలను ఆవిష్కరిస్తాయి. ఇంతకీ ఆ జంతువులు ఏంటంటే..
కుక్క
కుక్క వాసన పసిగడుతుందంటారు.. కానీ, అది ఒక మనిషి చూడలేని దృశ్యాలు కూడా కుక్క చూడగలుగుతుంది. జాలి, ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే చాలామంది కుక్కలను పెంచుకునేందుకు ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు.
పిల్లులు
పిల్లుల కళ్ళు చూసేందుకు చిన్నగా ఉంటాయి. అయితే ఆ కళ్ళతో పిల్లులు ఆసక్తిని ప్రదర్శిస్తుంటాయి. కోపం, చికాకు కలిగిన మనుషులను కూడా తమ చూపుతో సమ్మోహితులను చేస్తుంటాయి. పాశ్చాత్య దేశాలలో చాలామంది పిల్లులను ఇందుకోసమే పెంచుకుంటారట.
గుడ్లగూబలు
ఈ పేరు వింటే చాలామంది భయపడుతుంటారు. కానీ గుడ్లగూబల కళ్ళు పెద్దగా ఉండడం అనేది చెడుకు సంకేతం కాదట. ఆ కళ్ల ద్వారా అవి ఎన్నో రకాల భావవ్యక్తీకరణలు చేస్తుంటాయట. కాకపోతే వాటిని చూసేందుకు మనుషులు పెద్దగా ఇష్టపడరు.
గుర్రాలు
గుర్రాల కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. అయితే ఆ కళ్ళ ద్వారా అవి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటాయి. వేగంగా దౌడు తీసే క్రమంలో ఆ కళ్ళు మరింత పెద్దవిగా అవుతాయి. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నిర్దేశించుకున్న స్ఫూర్తిని తమ కళ్ళ ద్వారా అవి ప్రదర్శిస్తాయి.
జింక
జింకకు చాలా చిన్న పరిమాణంలో కళ్ళు ఉంటాయి. శత్రువులు తన సమీపానికి వచ్చినప్పుడు జింక కళ్ళు పెద్దవిగా మారుతాయి. వెంటనే అది అప్రమత్తమవుతుంది. జింక దాని కళ్ళ ద్వారా బేలతనాన్ని ప్రదర్శిస్తుంది. దాని అమాయకమైన చూపులు మనుషులను కట్టిపడేస్తాయి.
ఏనుగులు
భారీతనానికి ఏనుగులు పెట్టింది పేరు. వాటి ఆకారానికి తగ్గట్టుగానే కళ్లు ఉంటాయి. విచారంగా ఉన్నప్పుడు ఏనుగులు ఏడుస్తాయి. అంతేకాదు తమ చూపు ద్వారా ప్రశాంతతను, నిర్మలత్వాన్ని ప్రదర్శిస్తుంటాయి.
చింపాంజీలు
మనుషులతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్న చింపాంజీలు.. విశాలమైన చూపును ప్రదర్శిస్తుంటాయి. ఈ చూపులు అనేక రకాల భావాలను వ్యక్తీకరిస్తాయి.
డాల్ఫిన్లు
విశాలమైన చూపుకు ప్రత్యక్ష ఉదాహరణగా డాల్ఫిన్లను చెబుతుంటారు. ఇవి తమ చూపు ద్వారానే ఇతర డాల్ఫిన్ లతో సంభాషిస్తాయి.
ఎర్ర పాండాలు
ఇవి చురుకైన చూపుకు ప్రతీకలు. తమ చూపు ద్వారా ఉత్సాహాన్ని, అచంచలమైన ఆనందాన్ని ప్రతిబింబిస్తుంటాయి.
లేమర్స్
క్షీరద జాతికి చెందిన ఈ జంతువులు.. రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. ఇవి విశాలమైన చూపును కలిగి ఉంటాయి. రాత్రిపూట సంచరించే క్రమంలో తమ చూపు ద్వారా అద్భుతమైన హవ భావాలను ప్రదర్శిస్తుంటాయి.
ఆవులు
సాధు జంతువైన ఆవు విశాలమైన చూపును కలిగి ఉంటుంది. కోపం, జాలి, నిర్మలత్వాన్ని ఏకకాలంలో తన చూపు ద్వారా ఆవు ప్రదర్శించగలదు..
తోడేళ్లు
ఇవి పరాక్రమానికి ప్రతీకగా ఉంటాయి. వేటాడే సమయంలో తీవ్రమైన భావోద్వేగాన్ని తమ చూపు ద్వారా ప్రదర్శిస్తాయి. క్రూరత్వాన్ని తమ చూపు ద్వారా ప్రతిబింబిస్తాయి.