Virat Kohli: కోహ్లీ తర్వాత అతడే.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం సరికొత్త రికార్డు..!

Virat Kohli: చివరి టి20 మ్యాచ్లో బాబర్ అజాం 22 బంతులలో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 36 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టి20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు బాబర్ అజాం కేవలం 15 పరుగుల దూరంలో ఉన్నాడు.

Written By: NARESH, Updated On : May 31, 2024 8:59 pm

Virat Kohli

Follow us on

Virat Kohli: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్ లో సరికొత్త మైలు రాయిని అందుకున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ దేశంలో పర్యటిస్తోంది.. టి20 వరల్డ్ కప్ కు సన్నాహకంగా నాలుగు టీ -20 మ్యాచ్ ల సిరీస్ ఆడింది. రెండు మ్యాచ్లు వర్షం వల్ల రద్దు కాగా, మరో రెండు మ్యాచ్లలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది..2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది.. గురువారం జరిగిన ఆఖరి t20 మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం సరికొత్త రికార్డు సృష్టించాడు. సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజాం సాధించిన ఘనత ఒక్కటే ఉపశమనం కలిగించింది.
చివరి టి20 మ్యాచ్లో బాబర్ అజాం 22 బంతులలో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 36 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టి20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు బాబర్ అజాం కేవలం 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ లిస్టులో టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 4,037 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.. కోహ్లీ 117 మ్యాచ్లలో 109 ఇన్నింగ్స్ లు ఆడి ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీల సహాయంతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం 119 మ్యాచులు ఆడాడు. 112 ఇన్నింగ్స్ లలో 4,023 పరుగులు చేసి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో మూడు శతకాలు, అర్థ సెంచరీలు ఉన్నాయి. బాబర్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3,974, పాల్ స్టిర్లింగ్ 3,589, మార్టిన్ గుప్తిల్ 3,531 పరుగులతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు..
ఇక అంతర్జాతీయ టి20 లలో 2,500 పరుగులు చేసిన తొలి పాకిస్తాన్ కెప్టెన్ గా బాబర్ అజాం అరుదైన ఘనతను సృష్టించాడు. ఇప్పటివరకు బాబర్ 81 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించా. 2,520 పరుగులు చేశాడు. అతని తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 76 మ్యాచ్లు ఆడి, 2,236 రన్స్ చేశాడు. వీరి తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియంసన్ 2,125, రోహిత్ శర్మ 1, 648, విరాట్ కోహ్లీ 1,570 పరుగులతో తర్వాతి స్థానాలలో ఉన్నారు.. ఇక అంతర్జాతీయ టి20 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు అతడు ఇంగ్లాండ్ జట్టుపై 641 రన్స్ చేశాడు. 140 స్ట్రైక్ రేటును కలిగి ఉన్నాడు. ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ 639, ఆరోన్ ఫించ్ 619 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు.