Gold, Silver Prices: గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో బంగారం, వెండి కొనుగోళ్లు క్షీణించిన సంగతి తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం వల్ల బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పట్లో బంగారం ధరలు తగ్గడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరగడం గమనార్హం.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,800 రూపాయల నుంచి 53,890 రూపాయలకు పెరిగింది. బిస్కెట్ గోల్డ్ 999 బంగారం ధర ఏకంగా 1,090 రూపాయలు పెరగడం గమనార్హం. రాబోయే రోజుల్లో బంగారం ధర 60,000 మార్కును అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. ఆభరణాల తయారీ కొరకు వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 48,400 రూపాయల నుంచి 49,400 రూపాయలకు పెరిగింది.
Also Read: రష్యాపై కార్పొరేట్ యుద్ధం.. 50 దేశాలతో పుతిన్ కటీఫ్
22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,000 రూపాయలు పెరగడం గమనార్హం. హైదరాబాద్, విజయవాడ నగరాలలో ప్రస్తుతం ఈ ధరలు అమలవుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర 53,550 రూపాయలుగా ఉంది. సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటే కష్టమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఒక్కరోజులో కిలో వెండి ధర ఏకంగా 1,000 రూపాయలు పెరిగింది.
కిలో వెండి ధర ఏకంగా 70,000 రూపాయల నుంచి 71,000 రూపాయల వరకు పెరగడం గమనార్హం. పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు కళ్లెం వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read: కేసీఆర్ ‘ప్రధాని’ ఆశ అడియాశలేనా? ఒకవేళ మోడీ ఓడిపోతే కేజ్రీవాల్ కే ఛాన్స్?