https://oktelugu.com/

Ideal Marriage: ఆదర్శ వివాహం ఒకేసారి ఆరుగురు అన్నదమ్ముల పెళ్లి? నో కట్నం, చిన్నవాడి కోసం అన్న వెయిట్ చేశాడా?

పాకిస్థాన్ సిక్స్ బ్రదర్ వెడ్డింగ్: పెళ్లి అంటే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఇక కట్నం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లక్షల్లో బేరం ఆడుతుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 6, 2025 / 03:03 PM IST

    Ideal marriage

    Follow us on

    Ideal Marriage: పాకిస్థాన్ సిక్స్ బ్రదర్ వెడ్డింగ్: పెళ్లి అంటే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఇక కట్నం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లక్షల్లో బేరం ఆడుతుంటారు. మార్కెట్లో కూరగాయలకు బేరం ఆడినట్టు వరకట్నం వద్ద కూడా బేరాలు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మాయి తరుపున తండ్రి పడరాని కష్టాలు పడి పెళ్లి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక వివాహం గురించి తెలుసుకుంటే చాలా మందికి షాకింగ్ గా అనిపిస్తుంది. ఇంతకీ ఆ వివాహానికి అంత ప్రత్యేకత ఎందుకు అంటే?

    పాకిస్థాన్ లోని పంజాబ్ లో వివాహానికి సంబంధించిన ఆసక్తికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆరుగురు సోదరులు, ఆరుగురు సోదరీమణులు సామూహికంగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరి వివాహ వేడుక గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. వీరు జస్ట్ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు వీరి పెళ్లి వల్ల ఎంతో మందికి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. సింప్లిసిటీకి మాత్రమే కాదు ఐక్యతకు అద్భుతమైన ఉదాహరణగా మారింది. 100 మందికి పైగా అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

    అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ ఖరీదైన సంప్రదాయాలను విడిచిపెట్టి సరళత, వినయాన్ని ప్రోత్సహించింది ఈ వివాహం. ఇది ఒక రోజు ఫలితం కాదు. సోదరులు మొత్తం ఒక రోజు పెల్లి చేసుకోవడానికి చాలా కృషి చేశారు. వారిలో చిన్నవాడు ఇంకా యుక్త వయసుకు రాలేదు అని పెద్ద అన్న నుంచి ప్రతి ఒక్కరు వేచి చూశారు. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ వేడుకలో ఎవరు కూడా కట్నం తీసుకోలేదు. ఒక్క సోదరుడు కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు అనవసరంగా ఖర్చు పెట్టలేదు.

    గొప్ప వివాహ సంప్రదాయాలను సవాలు చేస్తోంది..
    ఈ వరులందరూ ఈ వివాహాన్ని ఒక ఉదాహరణగా మార్చాలని భావించారు. పెళ్లి ఖర్చుల కోసం చాలా మంది భూములను అమ్మడం లేదా అప్పులు చేయడం చూస్తుంటామని.. కుటుంబంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పెళ్లిళ్లను సులువుగా, సంతోషకరమైన కార్యక్రమంగా నిర్వహించవచ్చని చూపించాలనుకున్నామని అందరిలో పెద్ద అన్న తెలిపారు. ఈ కార్యక్రమం ఆరు జంటల సమ్మేళన వేడుక మాత్రమే కాదు, అప్పుల భారం పడే వారికి సమాజం అంచనాలను అందుకోవడానికి ఒక ఆశాకిరణం కూడా.

    వరకట్న నిషేధం.
    ఆరు గురి వధువుల నుంచి ఆరుగురు అన్నదమ్ములు ఎవరు కూడా ఎలాంటి కట్నం తీసుకోలేదని తెలిపారు సోదరులు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వివాహం. సమాజంలో వేగంగా వ్యాపిస్తున్న వరకట్న ఆచారాన్ని అరికట్టేందుకు వారు తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన ముందడుగు అని కొనియాడుతున్నారు ప్రజలు. వివాహానికి అసలు అర్థం ప్రేమ, ఐక్యత అని, ప్రదర్శన, ఖర్చు కాదని ఈ సంఘటన సందేశం ఇచ్చింది. సరళత, మానవీయ విలువలు సంపద కంటే ఎక్కువగా ఉంటాయని కూడా నిరూపించారు. అయితే ఈ సామూహిక వివాహంలో కేవలం 1 లక్ష పాకిస్తానీ రూపాయలు మాత్రమే ఖర్చు చేశారట. అంతే భారత కరెన్సీలో చూస్తే ఈ మొత్తం రూ.30 వేలు మాత్రమే.