Hero Srikanth : నటి అనిత చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె బుల్లితెర మీద పలు షో లలో తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తన యాంకరింగ్ తో ఈమె మంచి పాపులారిటీని కూడా సంపాదించుకుంది. 16 సంవత్సరాలకే అనిత చౌదరి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది.16 ఏళ్ళ అతి చిన్న వయస్సులో అనిత చౌదరి బుల్లితెర మీద ప్రముఖ టీవీ చానల్స్ జెమిని, ఈటీవీ, జీ తెలుగు లో పలు కార్యక్రమాలలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. యాంకర్ గా తనకున్న క్రేజ్ తో వెండితెర మీద కూడా గుర్తింపు సంపాదించుకోవడానికి అనిత చౌదరి 1997లో హీరో శ్రీకాంత్ నటించిన తాళి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ అనిత చౌదరి తనకు యాంకర్ గా చేయడం ఇష్టం ఉండడంతో ఆ సమయంలో వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకుందట. ఇక ఆ తర్వాత హీరో వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన రాజా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రాజా సినిమా లో అనిత చౌదరి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక రాజా సినిమాతో అనిత చౌదరి వెండితెర మీద నటించింది. ఇలా ఎన్నో చిత్రాలలో అనిత చౌదరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. సుమారు అనితా చౌదరి 50 కి పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఇలా అనిత చౌదరి బుల్లితెర మీద యాంకర్ గా అలాగే వెండి తెర మీద క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చినా అనిత చౌదరి కరోనా సమయంలో ఆక్వా అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఈమెది చాలా పెద్ద కుటుంబం. అనితా చౌదరికి ముగ్గురు అన్నయ్యలు మరియు ఒక అక్క ఉంది. కొంతకాలం పాటు తన కుటుంబ పూర్తి బాధ్యతను అనిత చౌదరి తీసుకుందట. తాజాగా అనితా చౌదరి, హీరో శ్రీకాంత్ కు దగ్గర బంధువు అవుతుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనిత చౌదరి కృష్ణ చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి 2005లో పెళ్లి చేసుకుంది. కృష్ణ చైతన్య హీరో శ్రీకాంత్ కు చాలా దగ్గర బంధువు.
హీరో శ్రీకాంత్ కృష్ణ చైతన్యకు అనితా చౌదరికి దగ్గరుండి మరి పెళ్లి చేయించారట. కృష్ణ చైతన్య హీరో శ్రీకాంత్ కు కజిన్ అవుతాడు. దాంతో శ్రీకాంత్ వీరిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేయించారట. ఈ క్రమంలోనే అనిత చౌదరి కూడా హీరో శ్రీకాంత్ కు బంధువు అవుతుంది. ఇక కృష్ణ చైతన్య, అనిత చౌదరి దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. ఈ విషయాలను నటి అనిత చౌదరి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.