Vajradanti: ప్రకృతిలో లభించే మొక్కల సహాయంతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చనే సంగతి తెలిసిందే. ఆయుర్వేద వైద్యులు ప్రకృతిలో లభించే మొక్కలను ఎక్కువగా చికిత్సలో వినియోగిస్తారు. ఈ మొక్క ఆకులతో పాటు వేర్లు, పువ్వులు, పండ్లు, కాండం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పళ్లు తెల్లగా మెరవాలని అనుకుంటే ఈ మొక్క యొక్క వేర్లతో పళ్లు తోముకుంటే మంచిది.
ఈ మొక్కల ఆకులను పేస్ట్ లా చేసుకుని పళ్లు తోముకోవడం ద్వారా గారను తొలగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామందిని నోటి దుర్వాసన సమస్య వేధిస్తోంది. ఈ ఆకుల కషాయాన్ని పుక్కలించడం ద్వారా నోటి దుర్వాసనతో పాటు నోటిపూతకు సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందిని గజ్జి, తామర, ఇతర చర్మ సమస్యలు వేధిస్తూ ఉంటాయి.
ఈ మొక్కల ఆకులను పేస్ట్ లా తయారు చేసుకుని అప్లై చేసుకుంటే ఆ సమస్యలు కూడా దూరమవుతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే ఈ ఆకుల పేస్ట్ ను ఉపయోగించవచ్చు. అధిక బరువు, కీళ్ల వాపుల సమస్యకు చెక్ పెట్టడంలో ఈ పేస్ట్ ఎంతగానో తోడ్పడుతుంది. మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఆకుల పేస్టును నొప్పి ఉన్న భాగంలో అప్లై చేయడం ద్వారా ఆ సమస్యను కూడా సులభంగా అధిగమించే అవకాశం అయితే ఉంటుంది.
ఈ మొక్కల బెరడును ఎండబెట్టి పొడిలా చేసుకుని తీసుకోవడం ద్వారా ఒళ్లునొప్పుల సమస్యలు దూరమవుతాయి. తగిన మోతాదులో వాడితే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. వజ్రదంతి మొక్క యొక్క ఔషధాలను వినియోగించే వాళ్లు ఆయుర్వేద వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.